కథనం
అంశం నేటి పిల్లలు సామాజిక బాధ్యత
శీర్షిక :వెదురు తడకల గుడిసెలెపుడైనా చూశావా !?
రచయిత అపరాజిత్ రెడ్డి
పొద్దుపొడిచి తెల్లవారగానే గుడిసె బురద పక్కన అంబలి తాగే బుడ్డోడు బుడ్డది,,,,,,,,
తెల్లవారగానే తల్లి కాసిన్ని రేషన్ బియ్యం చేటలో ఆడించి రాళ్లు పురుగులు ఏరి కట్టెల పొయ్యిపై ఉడికించి తను భర్త ఆవురావురంటూ తింటూ బుడ్డోళ్లకు పెడుతూ రోజు పని మొదలు,,,,,,,
అరేయ్ బుడ్డోడా చెల్లిని ఆడిస్తూ ఇంటిదగ్గరే ఉండు ఉట్టిమీద బువ్వ నువ్వు తిని చెల్లికి పెట్టు జాగ్రత్తరా అరేయ్ బువ్వ కుక్క తినగాలేరో ఏంది,,,, ,,,,,,,
భర్త భార్య ఇద్దరు సుతారి పనికి వెళ్తే పొద్దస్తమానం ఒళ్ళు హూనం హూనం అయ్యే చాకిరీ,,,,,,,
సాయంత్రం అయ్యే వరకు ఇద్దరూ అలసిపోయి దార్లోనే మందు దుకాణంలో వచ్చిన కూలి పైసల్లో సగం పైసలతో ఇద్దరు మందు తాగి ఇంత కారం ముద్దలు నోట్లో వేసుకుని ఇంటిదారి పట్టారు,,,,,,,,
వెళ్ళే దారిలో కిరణం కొట్టుదగ్గర ఉప్పు కారం పామాయిల్ ఉల్లిపాయలు దోసకాయలు వంటకు ,కిరోసిన్ తో దీపం పెట్టుకునేందుకు కొనుక్కుని తమ పిల్లలు కళ్ళల్లో మెదులుతుంటే గుడిసె దగ్గరకు వెళ్ళారు,,,,,,,
బుడ్డోడు తల్లితో బుడ్డదానికి జ్వరం వచ్చింది ఒళ్ళంతా కాలిపోతుంది అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ చెప్పాడు,,,,,,,,
తండ్రి అనేవాడు తాగిన మత్తులో గుడిసెలో మూలకు ముడుచుకుని పడుకున్నాడు,,,,,,,
తల్లి బుడ్డదాన్ని ఎత్తుకుని సర్కారు దావఖానకు తీసుకుని వెళ్ళింది,,,,,,
డాక్టరు పరీక్ష చేసిచూసి ఒంట్లో రక్తం తక్కువ వుంది రక్తం ఎక్కిస్తాం కాస్త ఆగు అని బుడ్డదాన్ని తీసుకుని లోపలికి తీసుకెళ్లాడు,,,,
తల్లి బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తోంది తెల్లవార్లు నిద్రలేదు,,,,, తెల్లవారుజామున బుడ్డదాన్ని చేతిలో పెట్టి ఈ మందులు వాడు పుష్టికరమైన బువ్వ పెట్టు అని నర్సమ్మ చెప్పింది,,,,,,,
తల్లి మధ్యాహ్నం పనిలో నెత్తిపై మాలు తట్ట మోస్తూ నిద్రలేక తల నిండా ఆలోచనలు గిర్రున తిరుగుతూ సోలిపోయి కింద పడిపోయింది,,,,,,, భర్త బుడ్డోళ్లు బోరుమని ఏడుస్తున్నారు తమ తల్లికేమైందని పిల్లలు అయ్యను అడుగుతుంటే తండ్రి ఆకాశం వైపు చూస్తూ క్రుంగే పొద్దుకు దండం పెడుతూ,,,,, మా కూటికి లేనోళ్ల బ్రతుకులింతేనా దేవుడా,,,,,, దేవుడా,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట