వెన్నెల చంద్రిక కళాచిత్రం నీ కోసం,,,,,!!
నా కనుపాపలు రెండు చంద్రికలు
నా కళ్ళు వెన్నెల గూళ్ళు
నా మనస్సును మందిరం చేసి
అందులో దేవత పాదాల చెంత వేసిన పూవుల పరిమళాల వెన్నెలలు నా కళ్ళు,,,,,,,,
పూదోటలోని పూవులన్నీ ఈ వెన్నెల వర్షంలో కదలి కదలి నా కళ్ళ కౌగిలిలో దాగి నా హృదయంలో ప్రణయలేఖలు రాసే జాబిలి కన్యకలు,,,,,,,
ఈ వెన్నెల చలి రేయి మనస్సు మంచుకళ్లలో తేలిపోయే పొగమంచులా సాలోచనల సమ్మిళిత సౌందర్య ఆకృతి సచేతన ప్రకృతి దిద్దిన సజీవ చిత్రం రెక్కల పూవుల అందం ద్విగుణీకృతం,,,,,,,
నేను నాటిన మొక్కల పూవులు నీ మంచుకళ్లకు ఆహ్లాదకరమైన సుందర నందనవనం ఓ విచిత్ర నవజీవన అనుభూతి,,,,,,,
ఈ లేత ఎరుపువర్ణం రెక్కల పూవులు సొగసరి జడలో మెరిసి మెరుగైన రూపంలోకి మార్చి ఇంద్రజను చేసి సౌందర్య పిపాసకుల హృదయాలను చూరగొనే ఆహ్లద అందాల వెన్నెల కామిణులు,,,,,,,
జాబిలి వెలుగు రేఖలు వెన్నెల వర్షం కురిపించినా కొలది తెల్లని చీరలో నవవధువు అందాల సుందరీమణి ఈ అవని మరి చెలికత్తె విరబూసిన ప్రకృతి కన్యక తొణికిసలాడే సురభామిని మరి పరిచారిక,,,,,,,
వినీల ఆకాశంలో వెన్నెల చంద్రిక చుట్టూ తారకల వెలుగుల తరంగాల కలల రాధాకృష్ణుల ప్రణయాలను వింత వింత రూపాల్లో ఆవిష్కరించిన కవులు కళాకారులెందరెందరో గదా ఈ జగతిలో,,,,,,,
కన్నుల కలల కళా రూపసులే జీవిత అగాధాలలోని అంధకారాలను ఇట్టే మైమరిపించి హృద్యమైన కళాచిత్రాలలో చిత్రంగా మనస్సు రంజిళ్ళు మనోరాగాలలో,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట