వెన్నెల పూజిత

ఈ వెన్నెల ఈ జాబిలి ఈ రేయి
ఈ పూల పరిమళాల అవనీతనయిక
ఈ పూదోటలో భామినీ లలామ
సొగసుపూల మరుమల్లియల సుందరి
వసంతాల వెలుగుల సౌందర్యరాశి
జాజిపూలతో జలకాలాడే మయూరమా
హృదయం నిండా లేతగులాబీల సుగంధాలు
విరసిత పూబోణీ నయనానందకర నర్తినీ
నీ ముఖారవిందం విరసిత బంగరు దీపిక
వెండిపూలు జారుతున్నట్లు తెల్లని వస్త్రాలు
రంగు రంగుల పూవుల సుగంధాలలో రంగులొలకబోస్తూ
విరసిత మోముపై వెండి వెన్నెల కిరీటం
లేతఆకుపచ్చని వనాల మద్య అప్సరస లలామినీ
యవ్వనం పూసిన పౌర్ణమి రాత్రి వేళ వెండితెరపై నటీమణి నీవే
ఆకాశం నుండి తొంగిచూసే వేకువజాము ఉషస్సువో
రాగాల లేఖలో వ్రాసిన అక్షరాల వాక్యాలలో సందేశానివి నీవేనా రూపసీ,,,,,,,,,
చూపుల సురుచిర కనుబాసల సరయూనదీ సంపెంగ పూవువా
విశాల గగణంలో విరిసిన సరసి తార చంద్రునికై తహ తహ
ఉరికే గోదారి సుడిగుండాల మయమైనా సాగిపోయే వయ్యారి నాట్య సురభామినివా ఏమి ఆ అందం,,,,,
మనస్సు పూసిన కలువ పూవుల మైమరపించే వేగుచుక్క సొగసు దానా
పూవుల రాణి గుభాళించిన గులాబీ రంగు వర్ఛస్సుకు
గులాములెందరో

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *