వెలుగు పూవులు లేనిది ఎప్పుడు,,,,,,,,,!!
ఈ నిశిరాత్రి నీడల్లో
కోల్పోయిన జీవితం మాధుర్యాన్ని వెతుకుతున్నావా మిత్రమా
అలుపెరుగని జీవిత పోరాటంలో
నీ కన్నీటి ఎద మాటు లోయల్ని
కనుచూపు మేరలో అగుపించకుండ
నీ ఫ్లాష్ బ్యాక్ గోతిలో తొక్కేయ్
నీలో నిజాయితీగా కష్టపడే తత్వముంటే
ఎన్ని గాయాలలో నైనా ఉద్యమించి దూసుకెళ్తావు
రాత్రిపూట ఆకాశంలో తళతళ మెరిసే నక్షత్రాలు
తూరుపు తెలతెల వారుతుండగానే
సూరీడు రువ్వే కాంతుల్లో వెలవెల బోతాయి
సాయంత్రం చీకట్లు ముసురుకొస్తూ
సూరీడును మింగేసి చీకటి నక్షత్రాలతో రాజ్యమేలుతుంది
అందుకే అశాశ్వతాలే ఒకదాని తరువాత మరోటి జీవితమంటే
ఈ వెలుగు నీడల్లోనే బ్రతుకు పుటల్ని లిఖిస్తాం
సుఖదుఃఖాలు పేకమేడలు
వాటిని వాటిగానే గమనిస్తూ
శ్రమల స్వేదం చిందిస్తూ
ఉన్నత శిఖరాలను అధిరోహించ గల సత్తా నీకుంది ఎవరెస్టు న్నైనా,,,,,,
అందుకే చక్రవర్తి దర్పణంతో జీవించు
కాని కట్టుబానిసలా వళ్ళువంచి పనిచేయి
జ్ఞాని ప్రపంచానికి జీవం పోస్తాడు తన నైరాశ్యం ఎప్పుడూ ఎవ్వరికీ తెలియనీయని ప్రజ్ఞ అతనిది,,,,,,,,,,,,
ఉరికంభం ఎక్కే ముందు ఖైదీని నీ చివరి కోరిక ఏమిటి అని అడిగితే,,,,,,,,,,
అతడు చెప్పేది తన భార్య బిడ్డల్ని చూడాలని ఉంది అంటాడు,,,,,,,,,
తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరిచిపోయాడు
గుర్తుంచుకో అందుకే ఆ ఉరిశిక్ష
కడు నీచమైన పనులు అందువల్లే చేశాడు,,,,,,
కనిపించని దేవుడినైనా తలుచుకుంటాడు కాని తల్లిదండ్రులు గుర్తుకురారు,,,,,,,,,
నేరాలకు మూలమిదే మిత్రమా
అపరాజిత్