వేణువూది నాడే ,గోపకుల బాలుడూ,
ఎద ఝల్లున ఉప్పొంగగ,
తనువు తమితో తనియగా!
గోకులమున వెన్నెలలు విరియగా,
లేగదూడ లానందముతో గంతులు వేయగా,
నెమలులన్నీ పురివిప్పి నాట్యమాడగా,
తరువులెల్ల ఊగి ఊగి ఫల పుష్పమ్ము వర్షించగా!…
మధురోహలు లోలోతుల
చిందులు వేయగ,
గోపకాంతలు ఇళ్ల నుంచి పరుగులు తీయగా,
పాడి గోవులు అప్రయత్నం గా క్షీరము నివ్వగా,
సూర్య చంద్రులు గగనాన
ఇది చూసి మురియగా!
చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి రాజమండ్రి