వేదన నుంచి వెలుగులోకి రా

వేదన నుంచి వెలుగులోకి రా,,,,,

శ్రుతి మించిన వేదనలు చుట్టుముట్టి వేదిస్తున్నాయా సోదరా,,,,,,,,,
రెండు కాళ్ళకింద భూమి బద్దలై నిలువునా చీలిపోయే కన్నీటి యెద,,,,,,,,
వయస్సు మీదపడుతూ ఏ ప్రేమ నోచుకోక చదివిన పట్టాలు వెక్కిరిస్తూ బరువైన బ్రతుకు,,,,,,,
కర్కశ లోకంలో మనలేని నీ పగిలిన హృదయాన్ని ఓదార్చేవారు లేక ఏ దైవానికి ప్రార్థిస్తున్నావు తమ్ముడూ,,,,,,,
మాసిన గడ్డంతో ముఖం ఎత్తుకోలేక కృంగిపోతూ అవమానాలలో ఆర్తితో ఆకాశంలో ఎగరలేని ఒంటరి పక్షివైన నీ వేదన ఎంతకాలం? నిన్నునిన్నుగా సోమరిని చేస్తుంది సుమీ,,,,,,,,
తలచిన తలంపులన్నీ అందరికీ నెరవేరవు మిత్రమా, నీ బట్టలను చూస్తే బంట్రోతు ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది,,,,,,,,,,
అందరూ కొండ శిఖరంపైకి చేరుకోలేరు సోదరా కొందరు కొండ పక్కన గడ్డిపూవులలొనే ఆనందాన్ని వెతుక్కుంటారు,,,,,,,,,,,
ఈ పేద దేశంలో ప్రభుత్వ ఉద్యోగం పగటికల ఉన్నదాంట్లో తృప్తిపడు బంట్రోతువైతేనేం ఆత్మగౌరవం దెబ్బతినకుండా నిన్నునిన్నుగా గౌరవించుకుంటూ సంసార జీవితం సాగించు పొదుపుగా,,,,,,,,,,,
దేశంలో ఆకలి తీరేందుకు ఎన్నెన్నో శ్రమల జీవితాలు గడుపుతున్నారు వాళ్ళకంటే నీవెంతో నయం సోదరా,,,,,,,
నవ్వుతూ అవమానించే వాళ్ళను పట్టించుకోకుండా నీవు నీవేలా బ్రతుకు ఊరికే మనస్సు కరిగి నీరవ్వకు నీ వేదన నుంచి వెలుగులోకి రా,ధైర్యం పుంజుకుని హీరోలా బ్రతుకు,,,,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *