శిథిలమైన జీవితాలు

కూలీనాలి చేసుకునే గరీబులు వారి పూరిగుడిసెలు, శిథిలమైన జీవితాల గోడలు లేనిదే నీ కర్మాగారాలు లేవు,నీ ఏడంస్తుల మేడలు లేవు,వారి కన్నీటి గోడు పట్టించుకునే వారు లేరు. చింకిచాపల బ్రతుకు టేడారి సుడిగుండాల్లో కొట్టుమిట్టాడుతూ, తినే బుక్కెడు బువ్వకోసం అష్టకష్టాల అరణ్యరోధనలు.వీళ్ళ జీవితాల నిండా రక్తాశ్రువులు. విద్య, సరియైన వైద్యం అందని దీనులు.
నెమ్మది నెమ్మదిగా గరీబులలో ఉజ్వల చైతన్యంతో ఐకమత్యం రగిలిపొగలై ఉక్కుపిడికిళ్లతో చరమ గీతాలు పాడే రోజులన్నీ రక్తసిక్తమైన ఎర్రమల్లెలే,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *