నాలోని భావాలకు
ఊపిరిలూదే
మనోహర రూపం
అనునిత్యం చెరగని
మనోజ్ఞ స్వప్నం….
వాలిన కనురెప్పల సిగ్గులో
చిలిపి సరాగాలు
అర్థం కాకున్నా…
నీతోనే
కమ్మని ఊసులు
పంచుకోవాలని
“అంతరంగం” కోరుకుంటుంది….!!
కలంలో
అమృతం నింపి
ప్రతి అక్షరంలో
ప్రణయ గాఢత ప్రతిబింబించే
నీ ఆగమన ప్రకాశం…
మనసు చేసే గారడిలో…
సరికొత్త విన్నపాలు
అర్థం కాకున్నా…
ఆత్మీయ ముచ్చట్లు
నీతోనే
విన్నవించుకోవాలని
“అంతరంగం” ఆశపడుతుంది….!!
నీవు లేని ఏకాంతం
మౌనమే నాకు మంత్రం….!
మనసు లోగిలికి
ఎదురుచూపులే
ఉషోదయ గీతాలని
అర్థం కాకున్నా…
కరిగే కాలాన్ని
నీతోనే
కలుపుకోవాలని
“అంతరంగం” ఆరాటపడుతుంది…!!
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల