శీర్షిక:”ఎందుకని”

ప్రతి ఆలోచన
కలతో మొదలవుతూ
మదిలో మెదిలే
మౌనరాగంతో
జత‌ కలిసిపోతూ…..

తలపుల జడివానగా
నిన్ను తడిపేస్తున్నా…

ఉలుకు పలుకు లేకుండా
“ఎందుకని”
ఉదాసీనంగా వుంటావు….!!

మాటల గుసగుసలు
కలవరపెడుతూ
గిలిగింతల
ప్రణయ గీతాలతో
పెనవేసుకొనిపోతూ…

నిర్విరామంగా
నీ చుట్టూ
ప్రదక్షిణలు చేస్తున్నా….

అక్షరాల అమరికలోని
ఆరాధన
“ఎందుకని”
అర్థం కాదంటావు….!!

అల్లిబిల్లి ఆశలు
అనంతంగా
అల్లుకుపోతూ….

కలల
అలల తీరంలో
ప్రేమ సముద్రాలే పొంగుతూ….

నీ ఆగమనం
కానరాక
రేయింబవళ్లు
మసకబారుతున్నా….

అంతరంగం మాత్రం
“ఎందుకని”
నువ్వే నా ప్రపంచం
అంటుంది‌….!!
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *