శీర్షిక:”చరిత్ర పుటల్లో”

తాను చూడని
తనకు కనిపించని
తన తెలివికి అందని
సృష్టి నిజం కాదనేది
మనిషి నమ్మకం….!!

నా శరీరం, పేరు
చదువు ,సంపద
పాండిత్యం…
నేను అనే భావనకు
మూలాలు….

ఆత్మ జ్ఞానానికి
అడ్డు తగిలే పొరలు…..!!

సుఖంగా ,సంతోషంగా
జీవించటానికి
కావాల్సింది
సిరిసంపదలు కావని
అందరికీ తెలుసు….

తెలిసినా కూడా
వాటి వెంటే
ప్రతి ఒక్కరి పరుగు….!!

అన్ని బంధనాలకు
కారణం మనసు‌….

ఆ మనసును
మౌనం చేయడం
నిజంగా తపస్సే…!?

అన్నీ వదిలేసినంత
మాత్రాన
ఆత్మజ్ఞానం పొందగలరా?

ప్రపంచంలోనే
ప్రపంచంతోనే సంచరిస్తూ…

మనసు
ఆకర్షణా సాగరాన్ని
దాటేస్తూ…..

ఆత్మ జ్ఞానాన్ని
అవగతం చేసుకున్నవారు
భౌతికంగా
కాలగర్భంలో కలిసిపోయినా….

కాలాతీత వ్యక్తులుగా
“చరిత్ర పుటల్లో”
నిలిచిపోతారు….!!
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *