శీర్షిక: పిగ్గి బ్యాంక్ లో దోపిడి…

రమా ఒసేయ్ రమా ఎక్కడున్నావు…

ఎందయ్య పొద్దు పొద్దున్నే నీ నస కారం తిన్న కాకి లాగా అరుస్తున్నావు అంటూ చిరాకుగా వంటింట్లో నుంచి చీర కొంగు దులుపుకుంటూ వచ్చారు రమా గారు…

నస అంతవేంటే అసలు ఏం జరిగిందో తెలుసా నీ సుమిత్రుడు అసలు ఏం చేస్తున్నాడో తెలుసా అని కోపంగా అడిగారు రాము గారు…

నా కొడుకు ఏం చేస్తాడు అయ్యా నీ కళ్ళన్నీ నా కొడుకు మీదే వాడు ఎక్కడో చక్కగా ఆడుకుంటూ ఉంటాడు అని కొడుకు అల్లరిని తలుచుకుంటూ మురిపెంగా చెప్పారు రమా గారు…

ఆడుకోవడం కాదే వాడు డబ్బులతో ఏవేవో కొనుకుంటున్నాడు అసలు వాడికి డబ్బుకు ఎక్కడివి నువ్వేమైనా ఇస్తున్నావా…

ఓయాబ్బో మీరు ఇచ్చే డబ్బులతో నా పోపుల్ డబ్బా నిండిపోయింది ఇంకా ఎక్కడ పెట్టాలో తెలియక నా కొడుక్కి ఇచ్చుకుంటున్నాను మరి అని వెటకారం గా అన్నారు రమా గారు…

ఆ వెటకారమే వద్దు అని పళ్లు కొరుకుతూ అన్నారు రాము గారు…

మరి ఎందయ్య నాకు అసలు డబ్బులు ఇస్తావా ఏదో పెద్ద ఇచ్చినట్లు అడుగుతున్నావు…పైగా నా కొడుక్కి ఇచ్చాను అంటున్నావు… పాపం వాడు ఏది అడిగినా కొనియ్యవు చేతికి డబ్బులు అసలే ఇవ్వవు…ఇంకా పాపం వాడేం కొనుకుంటాడు నువ్వు భ్రమపడి ఉంటావు లేదంటే మీ అమ్మనో,అయ్యానో ఇచ్చి ఉంటారులే రూపై పాపై…

రూపై పాపై కాదే వాడు వంద రూపాయల చాక్లెట్ కొనుకొని ఆ విధి చివర తింటున్నాడే నన్ను చూసి భయపడి అది అక్కడే పడేసి కంగారుగా వచ్చేసాడు…

అవున వాడికి వంద రూపాయలు ఎక్కడివి అబ్బ అని ఆలోచిస్తూ… సరే అయ్యా ఇప్పుడు వాడిని ఏమి అనొద్దు ఒక రెండు రోజులు చూద్దాం వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నువ్వు కంగారు పడి పిల్లాడిని భయపెట్టేయకు అని అన్నారు రమ గారు…

సరే సరే నువ్వు చెప్పావు కదా రెండు రోజులు చూస్తాను అసలు వాడు ఏం చేస్తున్నాడో అని లోపలికి వెళ్ళిపోయారు రాము గారు…

తండ్రి ఏమంటారో అని భయం భయంగా వచ్చిన కిరణ్ కి తన తండ్రి ఏమి అనకుండా రూమ్ లోకి వెళ్ళడం చూసి ఇంక ధైర్యం వచ్చేసి నన్ను ఏమి అనరులే అంటే అమ్మ ఊరుకోదు కదా అని ఉషారుగా వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్ళాడు…

అమ్మ అమ్మ నాకు ఆకలవుతుంది అమ్మ ఏదైనా పెట్టు…

అయ్యో కన్నా ఆకలి అవుతుందా అగు దోశ వేసి ఇస్తాను అంటూ హడావిడి పడిపోయారు రమా గారు…

మా అమ్మ బంగారం అంటూ వేసిన దోశ తినేసి బెడ్ ఎక్కి చక్కగా నిద్ర పోయాడు…

మరుసటి రోజు రాము గారు హడావిడిగా డ్యూటీ కి వెళ్ళిపోతే రమా గారు వంటింట్లో బిజీ గా ఉన్నారు ఇదే మంచి టైమ్ అనుకొని కిరణ్ హాల్లో పై సెల్ఫ్ లో పెట్టిన పిగ్గీ బ్యాంక్ లో దాచిన డబ్బుల్ని మెల్లగా చీపురు పుల్లతో తియ్యడం ప్రారంభించాడు…

వంటగదిలో ఉంటూనే కొడుకు ఏం చేస్తున్నాడో ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు రమా గారు…కిరణ్ చేస్తున్న పనిని చూస్తూ తన ఇంట్లోనే దొంగగా మారిపోతున్న కొడుకుని బాధగా చూస్తూ ఉండిపోయారు…

మెల్లగా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇది ఇలానే నడిస్తే తన కొడుకు చెడిపోతాడు అని ఆలోచించి దీనికి పరిష్కారం ఆలోచించసాగారు…

సాయంతం భర్త రాగానే జరిగింది చెప్పి మీరు వాడిని ఏమి అనవద్దు వాడు ఇలా అవ్వడానికి మీరు నేను కూడా కారణమే…వాడు ఏదైనా అడిగితే అవసరం లేదు అనుకోని వెళ్ళిపోతారు…నేనేమో మీరు మర్చిపోయి వదిలేసిన డబ్బులు ఉంటే అవి చూసి తీసుకో నాన్న అని గారం చేసేసాను… వాడి స్నేహితులు మా డాడీ అది కొన్నారు ఇది కొన్నారు అని గొప్పలు చెప్పుకుంటుంటే వాడికి బాధ అనిపించి  ఇలా చేసి ఉంటాడు మనమే వాడికి అర్ధం అయ్యేలా చెప్పి ఇంకొక సారి ఇలా డబ్బుకు తీయకుండా చూసుకుందాం అని అన్నారు రామా గారు…

సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి అని భార్య భుజం చుట్టూ చేయి వేసి అడిగారు రాము గారు…

చెప్తాను ఆగండి అని అంటూ కన్నా కన్నా ఎక్కడున్నావు అంటూ ప్రేమగా కిరణ్ పిలిచారు రమా గారు…

వస్తాను అమ్మ అంటూ పరుగున వచ్చాడు కిరణ్…

కన్నా నీకు మీ డాడీ సైకిల్ కొందాం అనుకుంటున్నారు రా…

అవున వావ్ ఎప్పుడూ అమ్మ అంటూ మెరిసే కళ్ళతో అడిగాడు కిరణ్…

త్వరలో నాన్న కానీ అవి నీ డబ్బులతోనే అని మెల్లగా బాంబు పేల్చారు రమా గారు…

అదేంటమ్మ నా దగ్గర డబ్బుకు ఎక్కడివి…నా దగ్గర అసలు డబ్బులు లేవు కదా…

ఇప్పుడు లేవు కన్నా కానీ ఆ పిగ్గీ బ్యాంగ్ ఉంది కదా అందుకో మీ డాడీ కొన్ని డబ్బులు దాచారం అందులో ఉన్నవి నీ సైకిల్ కి సరిపోవు కనుక మీ డాడీ రోజు నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు అవి అందులో దాచుకో… నీ బర్త్డే కల్లా అవి చాలా డబ్బులు అయిపోతాయి అప్పుడు నీ డబ్బులతోనే నువ్వు హ్యాపీగా సైకిల్ కొనుకోవచ్చు ఏమంటావు చెప్పు అని కొడుకుని చూస్తూ అడిగారు రమా గారు…

హో సరే మా డాడీ రోజు డబ్బులు ఇస్తే నేను అందులోనే దాచుకుంటాను అని సంతోషం గా చెప్పాడు కిరణ్…

కొడుకు దొంగ తనం చేసేసరికి కొడుకు దారి తప్పుతున్నాడు ఏమి అని భయ పడిన రాము గారికి భార్య ఆలోచన నచ్చి కొడుకుని దగ్గరకి తీసుకొని కన్నా నువ్వు నేను ఇచ్చే డబ్బులు రోజు దాచుకో అంతే కాదు మీ నాన్నమ్మ,తాతయ్య ఏమైనా ఇచ్చిన అవి దాచుకోవాలి సరేనా అంటూ చేతికి 10 రూపాయిలు ఇచ్చి ఆ పిగ్గీ బ్యాంక్ లో దాచుకో అని నుదుటిన ముద్దు పెట్టి లోపలికి వెళ్ళిపోయారు రాము గారు…

సరే డాడీ అంటూ తన చేతికి తండ్రి డబ్బులు ఇచ్చారు అని మురిసిపోతూ ఆ డబ్బులు పిగ్గీ బ్యాంక్ లో వేసుకున్నాడు…

పిగ్గీ బ్యాంక్ నుంచి భయ పడుతూ డబ్బులు తీసే కిరణ్ కి ఇప్పుడు అందులో తన చేతులతో డబ్బులు వేస్తుంటే ఏదో తెలియని ఆనందం వచ్చేసింది…తన దగ్గర తన డబ్బులు ఉంటాయి అని సంబరపడిపోతూ అమ్మని హత్తుకొని నేను త్వరలో నాకు ఇష్టం అయినా సైకిల్ కొనుకుంటాను అని గొప్పగా చెప్పుకున్నాడు…

కొడుకు ఆనందాన్ని చూస్తూ… చూడు నాన్న ఎప్పుడూ ఎవరిని అడగకుండా ఎక్కడ ఏ వస్తువు తీయకూడదు ముఖ్యం గా డబ్బుకు అవి ఎంతటి వారినైనా దారి తప్పేటట్లు చేస్తాయి… నువ్వు కష్ట పడి సంపాదించినవే నువ్వు వాడుకోవాలి నువ్వు చిన్న పిల్లాడివి కనుక ఇప్పుడు డాడీ ఇస్తారు అవి దాచుకుంటూ నీకు నచ్చినవి ఉపయోగ పడ్డవి కొనుక్కో నీకు ఏమైనా కావాలి అంటే నన్ను డాడీని అడుగు సరేనా అంటూ హత్తుకొని కిచెన్ లోకి వెళ్ళిపోయారు రామా గారు…

సరే అమ్మ నేను మీరు చెప్పినట్లే వింటూ అని అరిచి చెప్పి తను ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు

కొన్ని రోజులు అయ్యాక కిరణ్ బర్త్డే రెండు రోజుల ముందు ఆ పిగ్గీ బ్యాంక్ కిరణ్ తోనే పగలకొట్టి అందులో డబ్బులు లెక్క కట్టి కిరణ్ కోసం సైకిల్ తీసుకున్నారు రమా,రాము గారు…

తను దాచుకున్న డబ్బులతో సైకిల్ కొనుక్కున్నాను అని తన స్నేహితులందరికీ గొప్పగా సంతోషం గా చెప్పసాగాడు కిరణ్…

తన స్నేహితులు కిరణ్ ని చూసి గొప్పగా అనుకుంటుంటే పొంగిపోయి ఇలా రోజు డబ్బులు దాచుకోవాలి అని దృఢ నిర్ణయం తీసేసుకున్నాడు పదేళ్ల మా కిరణ్ బాబు…

కిరణ్ లో వచ్చిన మార్పు కి రమా,రాము గారు చాలా సంతోషపడిపోయారు…

నోట్: మీ పిల్లలకి డబ్బులు ఇవ్వండి కానీ అవి దాచుకోవడం నేర్చించండి…

సమాప్తం…

మీ క్రాంతి సుధా ✍️

హామీ పత్రం: ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *