అంశం : అసూయ, ద్వేషాలు ఉన్నవారి వలన ఎదుర్కొన్న బాధలు,,,,,,,,
శీర్షిక : శ్రమల కసి,,,,,!!
రచయిత :అపరాజిత్ రెడ్డి
నేను సుదీర్ఘ లక్ష్యాన్ని ఎంచుకుని ఉన్నతంగా ఎదుగుతూ అందళాలు ఎక్కుతూ సాగిపోయే తరుణంలో,,,,,,,,,
జీవితంలో ఆనంద కెరటాలలో తేలియాడుతూ వున్నపుడు నేను నేనైన అక్షర తపస్వున్ని,,,,,,,,
అసూయ రగిలి పొగలైన వాళ్ళు దరిదాపుల్లోకి రాలేని దుస్థితి,,,,,,,,,
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నది పచ్చినిజం,,,,,,
జీవితంలో కారుమబ్బులు కమ్మి దిక్కుతోచని దుస్థితిలో కొట్టుమిట్టాడుతూ,,,,,,,,,,
రంగురంగుల భవిష్యత్తు అంతా నాకై నేను చేజార్చుకుని అంకుశపోట్ల వెతల్లో కొట్టుమిట్టాడుతుంటే దినదిన గండం నూరేళ్ళ ఆయిషులా కుమిలిపోతూ జీవించడమే గగణమైన దుర్దినాల్లో,,,,,,,,,,
బాగయింది అహంకారికి తగిన శాస్తి జరిగింది అంటూ అసూయ విద్వేషాలలో
మునకలేసిన జనం ఇగో సంతృప్తి చెందింది,,,,,,,,,
నేను నేనుగా జీవితం నేర్పిన గుణాపాఠాల్లో రాటుదేలిన అగ్గిపిడుగునై జీవితంలో దూసుకెళ్తుంటే,,,,,,,,,,,
నన్ను పనికిమాలిన వాడని తూలనాడిన వాళ్ళే నా శ్రమల అశ్రువుల జీవిత పోరాటంలో విజయేంద్రున్నై జైత్రయాత్ర కొనసాగిస్తుంటే అసూయ,ద్వేషంతో మొరిగే కుక్క లెన్నో,,,,,,,,,,
అసూయ, ద్వేషాలు మనుష్యుల మధ్య, మతాలు, కులాలు, జాతుల మధ్య చిచ్చుపెట్టే క్రూరమృగాలు చేసేదేంలేని చవటలు ,శ్రమల సౌందర్యం తెలియని మూర్ఖులు,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట
హామీ పత్రం : ఈ రచన నా కలం సేత యని నా హామీ.