బడే సాహెబ్ షేక్ తెలుగు భాషను రక్షించుకోవాడనికి ‘మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడా కాపాడుకుందాం అనే ‘ వ్యాసాన్ని ‘వార్త’ దినపత్రికలో వ్రాశారు. అప్పటి నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో ఇతను వ్రాసిన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.
బడే సాహెబ్ షేక్ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో 1948 జనవరి 1 ఒకిటిన జన్మించారు. వీరి తల్లితండ్రులు: హసన్ బీ, ఖాశిం సాహెబ్. చదువు: బి.కాం. భారత తపాలాశాఖ విశ్రాంత ఉద్యోగి.
చిన్నతనం నుండి తెలుగు భాష పట్ల మక్కువ ఎక్కువగా ఉన్న ఇతను 1991 నుండి తెలుగు భాషను రక్షించుకోవాడనికి నడుం కట్టి ‘మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడా కాపాడుకుందాం’ వ్యాసాన్ని ‘వార్త’ దినపత్రికలో రాశారు. అప్పటి నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో ఇతను వ్రాసిన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.
రచనలు
తెలుగును సులభంగా నేర్చుకోడనికి, నేర్పడనికి వీలయ్యే విధాంగా ‘మా హసన్‌బీ తెలుగు వాచకం’ అను పుస్తకాన్ని 1991లో వ్రాసి 2005 లో వెలువరించారు. పలువురికి ఆ విధానం నేర్పుతూ గుర్తింపు పొందారు. లక్ష్యం: తెలుగు భాషను నేర్చుకోవడం సులభతరం చేయాలన్నది వీరి లక్ష్యము.
వీరు సమాజానికి చేసిన సేవను గుర్తించి రాష్ట్రంలోని పలు సాహిత్య, సాంస్కృతిక వేదికలు ఆయనను సన్మానించాయి. చివరిక్షణం వరకు సాహిత్య సృష్టిచేస్తూ, శ్రావ్యంగా పాడి ప్రజలకు విన్పిస్తూ, ప్రదర్శిస్తూ ఇటు కవి-రచయితగా అటు మంచి నటుడు, గాయకుడిగా ప్రజల మన్నన పొందిన షేక్ బడే సాహెబ్ గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో 2007 ఆగస్టు 31న కన్నుమూశారు. (ఇంటర్యూ: షేక్ బడే సాహెబ్ రెండవ కుమారుడు షేక్ మహమ్మద్ మూసాతో 21-10- 2009న ఇంటర్యూ, 2001 ఏప్రిల్ 18న, విజయవాడలో షేక్ బడే సాహెబ్ స్వయంగా వెల్లడించిన విశేషాలు.)
ముహమ్మద్ ప్రవక్త రచనను ప్రదర్శనకు యోగ్యంగా తయారుచేసి స్వయంగా పలు ప్రదార్శనలను నిర్వహించారు. ధార్మిక, సామాజికాంశాల మీదా తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో పలు రేడియో ప్రసంగాలు చేశారు. ముస్లింల పట్ల ముస్లిమేతరులలో గల అపోహలను తొలగించడనికి కవితలు, గేయాల ద్వారా ఎంతో కృషి చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు కోరుతూ ప్రజలు ఉద్యమిస్తున్న సందర్భంగా ‘నేను ఓసి నెట్లవుతాను’ అంటూ పాట రాసి, స్వయంగా పాడిన గీతం వీరికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఎక్కడ సభ గానీ, సమావేశం గానీ జరిగినా అక్కడికి వెళ్లి ఆ పాటను పాడి విన్పించిన తరువాత మాత్రమే అక్కడ మిగతా కార్యక్రమాలు మొదలయ్యేవి. అంతేగాక వీరు స్వయంగా హిందీ విద్యాలయాన్ని స్థాపించి ఆ భాషాభివృద్ధికి జీవితాంతం పాటుపడ్డారు. కవిగా హిందూ-ముస్లిం ఐక్యత కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు.
మాధవి కాళ్ల
సేకరణ