సంతోషాలతో సందేశమా

సంతోషాలతో సందేశమా…!!!

బడాయిలతోనో లడాయిలతోనో
మక్కవతో మజాతో గడిచిన రోజులు
ఆత్మ స్ఫురణకు అర్థమైనా కాకపోయినా
నీ బతుకుతో నడిచిన సాక్ష్యాధారాలు…!!
రంగుదేలుతు పొంగులతో మునిగిపోతూ
అద్దమై కనబడినా అడగని సమయాలు…
తీపిగుర్తులను మూటగట్టుకు పోతున్నవని
విషాదమా ఒసగిని సంతోషాలతో సందేశమా

కాలమో కాలంచెప్పని మౌనమో
నాతో నేను చెప్పుకొన్న మనస్సు మాట…
తిరిగే నేలకు శ్రీకారంగా వచ్చీపోయే
వసంతాలు ఋతువులా రాగాలు నిత్యాలే
తప్పని క్షణాలు మనతో ఆస్వాధింపైనా…!!
అదే నూతన సంవత్సర శుభాకాంక్షలతో
అందరికి పండగ వాతావరణం కావాలని…

గతంతో నేర్చినవన్నీ జ్ఞాపకాలే
సుఖదుఃఖాలు మంచిచెడులు అనుభవాలే
నీ వంతుగా వర్తమానాన్ని ఒడిసి పట్టుకో…!!
కోరికలను కోరింతల జాడ్యాన్ని ఆవలించకు
కొలతబడని కోణాలను మెడన దాల్చకు…
సమయపాలనకు నీదొక చేయి కావాలని
ప్రగతి బాటలను నడపాలని కోరుకొంటూ…

కొత్త మలుపొచ్చిందని మత్తులోకంలో
ఎత్తిన కోటలకు రంగులను పూసుకోనక…
కేవలం నీవేకాదు నీతో సమాజముందని
దాని బాగోగులకై నీవు పరితపించాలని…!!
మనిషిగా మానవత్వాన్ని మొలిపించాలని
వెలుగులా ప్రభవై సారధిగా ప్రయాణమై…
భావితరాల సమగ్రతకు సాధికారితలకు
రూపమై నీ దేశరక్షణకు పహారా కాయాలి…

(నూతన సంవత్సర శుభాకాంక్షలతో)

దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *