అక్షర కొరకు
అంశం – ఉగాది
రచన – ఉమాదేవి ఎర్రం
శీర్షిక – సంవత్సరాది
ఉగాది ఒక కొత్త
సంవత్సరాది
మావి చిగురు తొడుగు
వసంత ఋతువు మెరియు
వేప పూత కలయు కలయిక!
వసంతోత్సాహం
కోయిలమ్మ కుహు కుహు
రాగాలు నెమలమ్మ నృత్యాలు
వచ్చింది వచ్చింది ఉగాది
ఒక కొత్త సంవత్సరాది!
పంచాంగ శ్రవణాల వీణుల
విందు పచ్చదనంతో కన్నుల
పండుగ చంటి పిల్లలకు
కుడుకల పేరు చిలుకల దండ
కొత్త బట్టల కళ కళ!
నోటికి రుచికరమైన భక్ష్యాలు
నోరూరించే ఉగాది పచ్చడి
పులిహోర,దద్దోజనం
ఆయురారోగ్యాలను పెంచే
కమ్మటి విందు ఉగాది పండుగ
పసందు!
పచ్చటి శోభ ప్రకృతి అందం
కలబోసిన కమ్మటి దినం
రంగు రందుల పూలతో
ఉదయించే ఉదయం ఉగాది
పసందైన పర్వ దినం!
ఇది నా స్వీయ రచన..