సన్నజాజిపూవు సౌందర్యం

సన్నజాజిపూవు సౌందర్యం

శుభ్రంగా తలంటు స్నానం చేసి
నీ అందాల నల్లని కురులు ఆరబోసుకుంటున్న యువతీ,,,,,,,
చూపరులను సమ్మోహితుల్ని చేసే మయూరి సొగసు పూవుల దుపట్టా దానా,,,,,,
నీ అబ్బురపరిచే ఆనందాల ముఖకవళికలలో సోగకనుల చిన్నదానా నీ హృదయం చూరగొన్న చోరుడు సౌందర్య పిపాసకుడని నవమన్మధుడని అర్ధమవుతోంది,,,,,,,,,,
జీవితంలో పూర్ణసంతృప్తి గల ఇల్లాలువని జాబిలి కన్నుకుట్టే పసుపు ముద్దబంతిపూవులాంటి వస్త్రధారణలో మిసమిసలాడుతూ చూపరుల కలల రాణివి సుఖమయివి,,,,,,,,,,
నల్లని కురులు ఆరబోసుకుని దువ్వెనతో కేషసంస్కరణ చేసుకుంటున్న పూర్ణచంద్రవదనీ ,,,,,,,,
బంగరువన్నె సున్నితమైన శరీరంతో సుకుమారీ కన్నెలేడిలా ఉరుకులు పరుగుల జీవితాన్ని అవలీలగా కొనసాగిస్తున్న నేర్పరివని అర్ధమవుతోంది,,,,,,,,
నీవు మేల్కొన్నాకే సూర్యుడు నీ అంతరాత్మలో మేల్కొన్నట్లున్నాడు అవును చకచకా పనులు చక్కబెట్టి మనస్సు ఉరడిల్లే దాకా కాలక్షేపం చేస్తూ కనువిందు చేస్తున్న కళాపుష్పానివి కనకాంబరాణివి,,,,,,,,
సఖుడేతెంచే దాక నయనానందకరంగా అలంకరించుకుని జీవితం రంగుపూవుల అల్లిక చేసుకునే పండంటి కాపురంలో జీవనజ్యోతి,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *