సరస్వతి మహాతల్లి

మనస్సు పూదోటలో విరిసిన తెల్లకలువలో దేవేరి
చదువుల తల్లి విజ్ఞాన గని సరస్వతీ మాత
కావ్యసంపుటాల కమనీయ ఆస్వాదనలు పరవశాన
జ్ఞానం పుట్టుకతో దివ్యగ్రంథాలకు మూలాలు నీలోంచి ఎగిసిపడ్డ అమృతాలు
ఆనందో బ్రహ్మ ,,,,,,,తిమిరాల నుంచి జ్ఞాన జ్యోతిర్మయం దాకా నీవే తల్లివి తండ్రివి,,,,,,,
ఈ విశాల జగత్తులో అక్షరాలు పూయించి కారుచీకట్ల లోకంలో దివ్యత్వం అంకురాలు మొలకెత్తించింది నీవే తల్లీ ,,,,,,,,,
తెల్లని కాగితపు రేఖలలో అక్షరాల జ్ఞాన నిధులను చదివించే తల్లివి నీవే తల్లీ,,,,,,,,,,,
బ్రహ్మ జ్ఞాన నేత్రానివి విశ్వకుటీరంలో ఆత్మజ్ఞాన తత్పరత కోసం పండితుల లేఖినివి నీవేయై వెలుగుల దేవేరివి,,,,,,,,
అక్షరాల అంబులపొది నుంచి ఒక్కో కావ్యాన్ని అజ్ఞానం అంధకారంపై జ్ఞానతృష్ణ అనే ధనస్సు నెక్కుపెట్టి గురిచూసి కొట్టే అలౌకిక ఆనందాల హరివిల్లు నీవే తల్లీ,,,,,,,,,,
సకల విద్యాపారంగతులకు ఆకలి దప్పికలు నీవే తల్లీ,,,,,,,,
పండితులలో దేదీప్యమానంగా వెలిగిపోయే కీర్తి సుమాలను పూయిస్తూ సమాజంలో వెలుగుపూల అక్షరాలతో మనస్సు ఉల్లాసాల ఉగ్గుపాల జ్ఞానోదయం,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *