సాంత్వన

జ్ఞాపకాల బాటలో మనిషి
ఊట బావిలో మనసు
ఓ పట్టాన తేరుకోవు

కాలం కౌగిలిలో వయసు
మునిమాపువేళలో చూపు
కరిగిపోతూనే ఉంటాయి

వీడివెళ్ళిపోయే మిత్రులు
వెనక్కి తిరిగి చూడమంటున్న అనుభవం
కలవని దారుల కలువ పూలు

నిన్ను రేపుల కలబోతలో
నేటి మాట నీటిమూటవుతుంటే
elixir లా మనిషే సాంత్వన

సి.యస్.రాంబాబు
9/11/25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *