సామాజిక రుగ్మతలకు దారేది?! స్కెచ్
ఒకప్పుడు జనాభ తక్కువగా ఉండి, మీడియా,రవాణా సౌకర్యాలు, జనసంచారం ఇంతగా లేవు.కాని ఇప్పుడు విద్య,వైద్యం విరివిగా అందుబాటులోకి వచ్చాయి.మీడియా విస్తరణ, జనాభా పెరుగుదల విచ్చలవిడిగా దుర్వ్యసనాలకు బానిసలయ్యేందుకు మూలమయ్యాయి.
మనుష్యుల ఆలోచనలు క్రమేనా పెడదారులలో తక్కువ శ్రమతో వెంటవెంటనే ఆదాయం సమకూర్చుకునే మార్గాలు తొక్కుతున్నారు.
జనాభా పెరిగింది కాని విద్య చాలా వరకు అందుబాటులోకి వచ్చినా, పెచ్చరిల్లుతోన్న నిరుద్యోగ సమస్య, ఉపాధి కల్పనలు ప్రభుత్వాలకు తీర్చలేని పరిస్థితి.
వైద్యంలో విప్లవాత్మక మార్పులు వచ్చినా వింతవింత అంటువ్యాధులు, క్యాన్సర్ ,షుగర్,ఒబేసిటీ,గుండెపోట్లు లాంటి మహమ్మారీలు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి ముఖ్యంగా నిరుపేదల పాలిట శాపంగా మారాయి.
ఇది ఇలావుంటే చదువులు అబ్బని యువతరం తల్లిదండ్రులపై ఆధారపడుతూ దూర్వ్యసనాలకు బానిసలై తిక్కతిక్క సినిమాలు,స్మార్ట్ఫోన్లలో చూపించే బూతులు అదేపనిగా చూస్తూ అదేజీవితం అనుకుంటూ మనస్సు చెదిరి సామాజిక విద్రోహులవుతున్నారు.
వీటన్నింనీ దారిలోకి తేవడం ఏ ప్రభుత్వాలకు సాధ్యపడట్లేదు.అందుకే ఒక్కో టర్మ్ ఒక్కో సమస్యను ఎన్నుకుని పరిష్కరికిస్తేనే గాని చాలావరకు సాధ్యపడే విషయం. కాని ప్రభుత్వమేదైనా తమ రాజకీయ భవిష్యత్తుకై ఉచితంగా డబ్బులు పంచడం లాంటి చట్టాలతో జనాన్ని సోమరులను,వ్యసనపరులను చేస్తున్నారు.
వ్యవస్థ తన రూపం మార్చుకుంటేనే ఏదైనా సాధ్యపడుతుంది.ఈ వ్యవస్థ ఉన్నదున్నట్లుగా ఉంచి సామాజిక మార్పుకోసం ఎన్ని చట్టాలు చేసినా వృధా.
అపరాజిత్