సింహంలా కింగ్ లా బ్రతుకు
సింహం బ్రతికినట్లు కింగ్ లా బ్రతుకు.జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను వీరోచితంగా ఎదుర్కో. ఊపిరి బిగబట్టలేని సమస్యలైనా కళాత్మక జీవన విధానమే సరిదిద్దుతుంది. నైరాశ్యపు అంధకారంలో వైఫల్యాలకు కారణాలు వెతుక్కోకుండా బయటపడేందుకు మార్గం సరళం చేసుకో. ఎప్పుడూ నిన్ను నీవు నిందించుకోకు పదిమందిలో చులకనైతావు.ఎవ్వరూ నీకు సహాయం చెయ్యరు. నిన్ను నీవే తన్నుకుని గుద్దుకుని విజయం సాధించు. జీవితంలో నిరాశ నిస్పృహలలో గతంలో చిన్న సమస్యలైనా, ఎలా పరిష్కరించుకున్నావో గుర్తుచేసుకుని ఆమాదిరిగానే క్లిష్టమైన జీవితాన్ని సులభతరం చేసుకో.సాదారణ జీవన విధానము ,నిష్కల్మషమే నిన్ను మహోన్నతుణ్ణి చేస్తుంది. రోజులు మారాయి ఇప్పుడు ఏం చేసైనా బ్రతుకొచ్చు కానీ విలువలతో కూడిన జీవితం జీవించాలి.ఎన్నెన్ని సమస్యలు ఎన్ని కష్టాలు వచ్చినా సింహం నవ్విందిలా చేధించాలి.
అపరాజిత్
సూర్యాపేట