ఒకప్పుడు విషాదాంతం సినిమాలు వచ్చేవి అవి ప్రేక్షకుల హృదయాల్లో ప్రగాఢమైన ముద్రవేసేవి.తర్వాత్తర్వాత హీరో హీరోయిన్ లను అష్టకష్టాలు పెట్టి చివరకు వాళ్ళను కలిపి శుభం బోర్డు వేసి పంపించేవారు, హమ్మయ్య అనుకునేవారు ప్రేక్షకులు.ఇప్పుడు తలతోక లేని వెర్రిమొర్రి పాటల డ్యాన్సులు ఒక్కడు వందల మందిని హతమార్చినట్లు చిత్రీకరణలు ,ఎబ్బెట్టు డైలాగులు హీరో హీరోయిన్ లు సగం సగం బట్టలతో చిందులు ముగింపక్కర లేని, అంటే ముందే తెలిసిపోయే సినిమాలు, వెకిలి నవ్వులు పెడబొబ్బలతో హాలు దద్ధరిల్లి పోయేలా సౌండ్ సిస్టంతో మైండ్ మూగబోయి తేలిగిలపడి హాలు నుండి బయటకు రావడమే తరువాయి.
అపరాజిత్
సూర్యాపేట