తిరుమల కొండపై తిరుగంగ భక్తులు
యేడుకొండల వాడు కూడుబెట్టు!!
యాదాద్రి గుట్టపై పాదమ్ము మోపంగ
నరసింహ స్వామియే నాల్కదడుపు!!
భద్రాచలమ్మున భాసిల్లు రామయ్య
పండ్లు ప్రసాదాలు పరగ గూర్చు!!
శ్రీశైల మల్లన్న శీఘ్రమే చేయెత్తి
వరములు సరిగూర్చు భక్తులకును!!
తే!!గీ!!🚩🚩🚩🚩
దండి బెజవాడ దుర్గమ్మ దయను దలచు
చేర సమ్మక్క సారక్క చింతదీర్చు
భద్రముగ జూచు దేవత భద్రకాళి
కొలువ రావయ్య కృష్ణయ్య కోర్కెదీర!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట