నీదివ్య నామమ్ము నే స్మరించిన యెడ
నాజన్మ తరియించు నాగభూష!!
నీ పాద పద్మాలు నే మ్రొక్కినంతనే
నాపాపములు బోవు నాదిదేవ!!
నీ చుట్టు తిరుగుచు నేపూజ జేసిన
నా కర్మ కడతీరు నాగచూడ!!
నీలింగ రూపాలు నే ప్రతిష్టించుచు
నేపొంగి పోయెద నీలకంఠ!!
ఆ!వె!!🚩🚩🚩
చావుపుట్టుకలను శాసించు నటరాజ
బుద్ధిబలమునొసగు భూతనాథ!
రేయిపవలు గావు రేపాల పురవర
నిన్నుదలవ మాన నిజము శివుడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!