సుందర లోకాల నుండి దిగివచ్చిన నీ పుత్రుడు,,,,,,,,!!
సాగర కెరటాలహోరు తీరం చెంత నీ బిడ్డపై అపురూప ప్రేమ రూపసీ,,,,,,,,
నీ అందాల అనుబంధాల కలల కనుపాపడు నీ పుత్రుడు సుమధుర భాష్యంతో కనువిందుచేస్తూ జీవితం లోలోతుల సౌందర్యం పురివిప్పి నాట్యంచేసిన చందం,,,,,,,,,
అలలు అలలుగా పొంగిపొర్లే నీ ప్రేమరసం ఉదయకాంతులలో పూసిన యవ్వనంలో పున్నమి చంద్రునిలా అరుదెంచిన నీ పుత్రుడు కలల కళానిలయం,,,,,,,,,,,,
అగాధలోతుల మహాకడలి నిత్యనూతన సౌందర్య పిపాస వీక్షకులకు ,నీ బిడ్డపై నీకున్న అలవికాని మమకారంలో గారాలుపోయే నందగోపాలుడు నీ శిశురత్నం ఆనందహేళ,,,,,, ,,,
కంటికి రెప్పలా బిడ్డని కాపాడుకునే నైజం ఎవరు నేర్పారమ్మా గంగాజననీ జీవితంలో ఆశలు పుష్పించి ఫలియించి రూపుదిద్దుకున్న సుకుమార అందమైన పుత్రుని గాంచి ఇహలోక కష్టాలనుబాపు బుడతడు బుడిబుడి నడకల మురిపాల ముద్దుల తనయుడు,,,,,,, ,,,,
నీ అవనీ తనయుని దివ్యరూపం గాంచి మరులుగొను దివిలోని గంధర్వకన్యలైనా కళాకాంతుల రూపం ప్రజ్వరిళ్లుతోంది ఇలలో,,,,,,,,,
మహాసముద్రం ఈదుకుంటూ ఆవలి ఖండం చేరావా గోపాలుడా నీ కోసం గోపికాచూడామణులు విరహంలో తపిస్తున్నారు సౌందర్య చక్రధారి నవమన్మధుడా,,,,,,,
అబ్బో సామాన్యుడు కాదమ్మా నీ బిడ్డడు జగన్నాటక సూత్రధారి శ్రీమంతుడు చిన్నికృష్ణుడు,,,,,,
అపరాజిత్
సూర్యాపేట