అంశం : చిత్రకవిత
శీర్షిక :ఓయ్ కూలీ,,,,,,,,,!
పేరు అపరాజిత్ రెడ్డి
హామీ పత్రం : ఈ కవిత నా కలం సేత అని నా హామీ

ఈ వర్షాకాలపు సాయం సంధ్య
కారుమబ్బులు కమ్మి చీకటి పడే వేళ
పొద్దస్తమానం వరి నాట్ల కూలీగా
వళ్ళంతా హూనం హూనం అయి
నెత్తి మీద నీళ్ళ కుండ చేతిలో నూనె డబ్బా
కాయాకష్టం చేయనిదే బ్రతుకు గడవదు
వానల్లో నాని ఎండల్లో ఎండుతూ !
గుక్కెడు మంచినీళ్ళు సుదూర తీరాల నుంచి మోసుకు రావాలి
ఆకలి కుక్షులతో పిల్లలు అమ్మ కోసం ఎదురు చూపులు
చాలీచాలని కూలీ పైసలు వంట నూనె ఇంటి సరుకులు
మనిషిని పీల్చి పిప్పి చేసే జీవన పోరాటం
చెట్ల ఆకులు రాలినా మళ్ళీ చిగురిస్తాయి
మా కూలీల బ్రతుకులు ఎండిపోయిన గడ్డి పోసలు !
దిన దిన గండం నూరేళ్ల ఆయిస్సు
కట్టుకున్నోడు కండలు పిండిచేసినా పొట్ట పోసుకోవడానికే కన్న తిప్పలు!
కష్ట జీవులు లేనిదే భూగోళం తన చుట్టూ తాను తిరగదు
ఏ దైవమూ కరుణించడు gv సరిగదా
కర్మ సిద్దాంతం నమ్మే దేశంలోకష్టజీవుల కన్నీళ్లకు
ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎంత సేపు దేవుళ్ళ పురాణాలు వల్లె వేయడమే
ఈ పూజలు పునస్కారాలు బువ్వ పెట్టావు గదా సారు!
ప్రకృతి ఒడిలో బిడ్డలం పంట పొలాలే మా దేవతలు
ఈ భూమిపై పుట్టినందుకు మీకు మీ పిల్లలకు చాకిరీ చేసేవాళ్ళం
ఈ అనగదొక్కబడ్డ జీవితాలు తిరగబడే రోజులు వస్తాయి
మేము మనుషులం బానిసలం కాదు
మీ నున్నని నాజూకు శరీరం మా భిక్ష
ఆకాశంలో వెలిగే పొద్దు సాక్షిగా మీకు మీ వ్యవస్థకు రోజులు దగ్గర పడ్డాయి!
తస్మాత్ జాగ్రత్త!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *