విఫలమైన నా ఆశలే
వేలాడే గుమ్మంలా,,,,,,
పాట మధురంగా వినిపిస్తోంది
రేడియో లో,,,,,,
కూలిపోయి శిథిలమైన ఇల్లు
గోడల్లో కూడు పెట్టే రైతన్న గోడుగొడున రోదిస్తూ,,,,,,
పక్కనే పంటపొలాలపై జల్లే
పురుగుల మందు డబ్బా తనకేం తెలియనట్లు పడివుంది,,,,,,,
పొట్టకొచ్చిన మూడెకరాల వరిచేను
వరదల్లో కొట్టుకుపోయింది
ఇక సెలవు రైతన్న అంటూ,,,,,,
కళ్ళు రెండు బైర్లు కమ్ముతూ
ఎగశ్వాస దిగాశ్వాసలతో నురుగులు కక్కుతూ,,,,,
తన ఆలిది పిల్లల రోదనలకు
ఊరు దద్దరిల్లింది సత్తెన్నా అంటూ పరుగులు,,,,,,,
ఎడ్లబండిలో పట్టణం పెద్దాసుపత్రికి తరలిస్తూ,,,,
ఎక్కడో గుండెలు పగిలి రక్తం కారుతున్న దృశ్యం కళ్లల్లో మెదులుతోంది,,,,
ఊరిలో ఎక్కడో దూరంగా
బైరాగి కుక్క స్మశాన వైరాగ్యంతో రోధిస్తోంది,,,,,,,
పైరగాలి దూరమైందని
పంట పొలాలు కన్నీళ్ళ
వరదతో నిండుకుండలు అయ్యాయి,,,,,,
ఎడ్లు పసులు తమతో పాటు రైతు శ్రమల శోకగీతాల గోస ఆలపిస్తున్నట్లు
రైతుపట్టిన నాగలి ఎడ్లజత
ఆకలి చచ్చి ఎదట గడ్డి సహించక
తమకు తాము గతం జ్ఞాపకాలను
నెమరువేసుకుంటున్నాయి,,,,,,
రైతు మూగజీవుల బాసలు
గుర్తెరిగిన వాడు
ఆకాశంలో మబ్బులు కూలడం
ఈతీరు వరదలు పోటెత్తడం తెలియదు
బైరాగి మరణమృదంగం వాదనలా
చెవులుపగిలి రక్తం కారుతుందని గుర్తెరగలేదు,,,,,,,,
శ్రమల శరీరం కాయలుకాసిన కండలు
ఎంతటి దుఃఖిత విపత్తునైనా తట్టుకుంటుంది ,,,”,,ఇది మరువకు,,,,,,,!!
-అపరాజిత్
సూర్యాపేట