జీవితంలో ఎల్లప్పుడూ పౌర్ణమిలే ఉండవు
ఎప్పుడూ అమావాస్యలే ఉండవు
కష్టసుఖాలలో ఎల్లప్పుడూ నీకు నీవే తొడునీడ
ప్రతిదినం మానవాతీతశక్తి యైన ఇష్టదైవాన్ని ప్రార్ధించుకో
నీకు కలిగిన దాంట్లో ఎంతో కొంత నిరుపేదలకు సహాయం చేయి
అది నీకు ఆత్మసంతృప్తికి, అదే నీకు ఆత్మస్థైర్యాన్నిస్తుంది
అన్నిరోజులు మనవి కావు
సంపదలు ఉన్నప్పుడు విర్రవీగకు
లేనప్పుడు గుండె ధైర్యాన్ని కోల్పోకు
లోకంలో జరిగేవన్నీ నిమిత్తమాత్రంగా గమనిస్తూ వుండు
ఏమరుపాటుతో సమస్యలు అతిక్లిష్టమైనా
ఒకటొకటిగా పరిష్కరించుకోవాలి
లోకంలో కష్టాలన్నీ మనకే వచ్చినట్లు కుదేలవ్వకు
కోపతాపాలు నిన్నే నీ అంతరంగాన్ని తినేస్తాయి
సాధ్యమైనంత వరకు ప్రశాంత జీవనం కొనసాగించు
కష్టపడు ప్రణాళిక ప్రకారం
పనులలో విసుగుపడకు మనస్సు, శరీరం అలిసిపోతాయి
ఓపిక సహనం నిన్ను నిన్నుగా నిలబెట్టే ఇంధనాలు
నీవు చేసిన తప్పుకు నీవే జవాబీదారి ఇతరులపై తోసేయకు
ఇతరులు నిన్ను మోసం చేసెకంటే నిన్నునీవు మోసం చేసుకోవడం అతిప్రమాదం
ఏ కళయైనా నిరంతర స్సాధనతో సుసాధ్యం
ప్రతి రోజు చదువుకోవడం, వ్రాసుకోవడం అలవాటు చేసుకోవాలి
దుర్వ్యసనాలకు బానిసై ఇల్లుగుల్ల చేసుకోకు
ప్రతి రోజు శారీరక శ్రమ చేయాలి
సోమరివై ఇతరులపై ఆధారపడకు వాళ్ళు నిన్ను బానిస చేస్తారు
ఎంత శ్రమపడినా కాలం అనుకీలించకపోతే చేసేదేం లేదు
అయినా నీ కర్తవ్యం నిర్వర్తించుకుంటూపో
ఫలితం నిర్ణయం చేసేది ఆ భగవంతుడు
అపరాజిత్
సూర్యాపేట