ఉదయం నుండి పడుకునేదాక
రణగొణధ్వనుల మధ్య బిజీబిజీగా వత్తిడిలో గడిచిపోయే రోజులు
ముసురుకుంటున్న వడివడిగా ఆలోచనల పరంపర
నిద్రలేక ఎండిపోయి ఆకులు రాలిన వృక్షంలా ఆందోళనల ఈదురుగాలులు
నిద్రలేని గుబులు మనస్సు పొరలు విచ్చుకుని ఆలోచనల అలజడులు
ఎంత ప్రయత్నించినా కునుకుపట్టని రాత్రులన్నీ
అగ్నిపునీత కళ్ళల్లో అగ్నికీలలు
తెల్లవార్లు కళ్ళుబైర్లు కమ్ముతూ కళ్ళల్లో మెరుపులు
రాత్రుళ్ళు నిద్రపట్టని అభాగ్యురాలి ఆక్రందనలలా రక్తసిరలు మసలే కళ్ళు
కునుకు పట్టని నిశీధిలో నీడలు నీడలుగా కదులుతూ కళ్ళు
శారీరం అలసిపోతే నిద్రనింపుకున్న కళ్ళు ఒళ్ళుతెలవని ఘాటైన ఘాడనిద్రలో కళ్ళు
పునీతలు మనస్సు తనువు
ఆయురారోగ్యాలు సిద్దించును జీవిత రథచక్రాలు వడివడిగా సాగిపోతూ,,,,,
మత్తుమందులు,బీరు,విస్కీలకు వచ్చేది నిద్రకాదు మరణానికి చేరువచేసే మత్తులో ,,,,,,చిత్తు,,,చిత్తు,,,,!
కష్టజీవికి అలసిసొలసి అలా పడుకోగానే ఘాడనిద్రలోకి జారుకుంటాడు
చమట పట్టని వైట్ కాలర్ మనస్సు ,నోటిని మాత్రమే ఉపయోగించే వాళ్ళు అలా ఆరుబయట నడక, రోజంతా హుషారుగా ఉంచుతుంది, రాత్రి త్వరగా నిద్రపడుతుంది,,,,,,, !!
అపరాజిత్
సూర్యాపేట