అక్టోబర్ 02 ప్రత్యేకతలు :⁠-

1.1535: ఫ్రెంచ్ విశ్లేషకుడు జాక్యూస్ కార్టైర్ 1535 అక్టోబరు 2న హోచెలాగా (మాట్రియల్ చూడండి) ను సందర్శించాడు, హోచెలాగాలో నివాస ప్రజలు “వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం” నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు.

  1. 1844: మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్‌ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు.
  2. 1845: భారతదేశంలో మొదటి షిప్పింగ్ కంపెనీ ప్రారంభమైంది.
  3. 1934: భారత నావికాదళం ( అప్పటి పేరు రాయల్ ఇండియన్ నేవీ) స్థాపించబడింది.
  4. 1951: శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు.
  5. 1952: సంఘ ప్రెంపుదల కార్యక్రమం ప్రారంభమైంది.
  6. 1954: ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న చందర్‌నగర్ పశ్చిమ బెంగాల్‌లో భాగంగా మారింది.
  7. 1955: చెన్నై లోని పెరంబూరులో ఉన్న సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) తన పనులు మొదలుపెట్టింది.
  8. 1961: బొంబాయిలో (నేటి ముంబై) షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది.
  9. 1966: భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే ఏర్పడింది.
  10. 1971: అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి గాంధీ సదన్‌గా ఇప్పుడు మనకు తెలిసిన బిర్లా హౌస్‌ను దేశానికి అంకితం చేశారు . ఇక్కడే మహాత్మా గాంధీ హత్య జరిగింది.
  11. 1972: భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ స్టేషన్ బొంబాయిలో మొదలయ్యింది.
  12. 1985: వరకట్న నిషేధ సవరణ చట్టం అమలులోకి వచ్చింది.
  13. 1988: సెప్టెంబర్ 17 నుంచి దక్షిణ కొరియాలోని సియోల్లో మొదలయిన 24వ ఒలింపిక్ క్రీడలు ముగిసాయి.
  14. 1988: తమిళనాడులోని మండపం ఇంకా పంబన్ నడుమ సముద్రంపై పొడవైన వంతెన తెరవబడింది.
  15. 1991: బీహార్ రాజధాని పాట్నా ఇంకా క్రొత్త ఢిల్లిల నడుమ శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ను మొదలుపెట్టారు.
  16. 1992: ఒడిషా రాష్ట్రంలోని పట్టణం, మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడింది.
  17. 1994: 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
  18. 2004: అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
  19. 2006: అణు ఇంధన సరఫరా సమస్యపై భారత్‌కు మద్దతు ఇవ్వాలని దక్షిణాఫ్రికా నిర్ణయించింది.
  20. 2008: భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
  21. 2009: తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
  22. 2012: తెదేపా అధినేత చంద్రబాబు చేసిన ‘వస్తున్నా మీకోసం’ 208 రోజుల పాదయాత్ర మొదలుపెట్టారు.
  23. 2014: స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం మొదలయ్యింది.
  24. 2016: భారతదేశంలో విద్య విధానాలమీద సంస్కరణల కోసం దేశంలో వున్నా స్వచ్ఛంద సంస్థలను, యువతను భాగస్వామ్యం చేస్తూ దేశంలో యువత ద్వారా సంస్కరణల స్థాపనే ఏకైక లక్ష్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం (వైపిపి) ఏర్పడింది.
  25. 1852: విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916).
  26. 1869: మహాత్మా గాంధీ, భారత జాతిపిత. (మ.1948).
  27. 1891: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (మ.1962).
  28. 1902: అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1987).
  29. 1904: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966).
  30. 1908: పర్వతనేని బ్రహ్మయ్య, ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980).
  31. 1910: డి. అర్కసోమయాజి, ఆంధ్ర విద్యావేత్త.
  32. 1911: అంబత్ మీనన్, కేరళ విద్యావేత్త.
  33. 1911: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (మ.1997).
  34. 1923: ఎం.శాంతప్ప, రాయలసీమకు చెందిన విద్యావేత్త, మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (మ.2017).
  35. 1924: తపన్ సిన్హా, ప్రముఖ సినీ దర్శకుడు (మ. 2009).
  36. 1926: నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. (మ. 1993).
  37. 1928: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (మ.1992).
  38. 1931: తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడు. (మ.2010).
  39. 1935: ఎన్.నిత్యానంద్ భట్, చలనచిత్ర నిర్మాత.
  40. 1942: ఆశా పరేఖ్, ప్రముఖ సినీ నటి.
  41. 1943: కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
  42. 1943: మినతీ సేన్, భారత 12, 13, 14 లోక్ సభ సభ్యుడు.
  43. 1961: సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ.2020).
  44. 1974: రచనా బెనర్జీ, ఒరియా, బెంగాలీ, దక్షిణాది చిత్రాల నటీ.
  45. 1900 : అక్టోబర్ 2 లీలా రాయ్ జన్మించింది.
  46. 1974: Veldi Indira అక్టోబర్ 2 జన్మించింది.
  47. 1422: ఫిరుజ్ షా బహమనీ.
  48. 1906: రాజా రవివర్మ, ప్రముఖ చిత్రకారుడు (జ. 1848).
  49. 1961: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి. (జ.1906).
  50. 1974: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900).
  51. 1975: కుమారస్వామి కామరాజ్, తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు.
  52. 1982: సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (జ.1896).
  53. 1992: హొన్నప్ప భాగవతార్, దక్షిణ భారత కర్ణాటక సంగీతకారుడు, నాటకరంగ ప్రముఖులు. (జ. 1915).
  54. 2018: ఎం.వి.వి.ఎస్. మూర్తి, విశాఖపట్నం లోని గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు అమెరికా లోని అలాస్కాలో మరణం (జ. 1938 జూలై 3).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *