నీ గొంతు పిల్లికూతలు,,,,,!!

నీ గానం పిశాచాల గోల
నీ రాతలు నిప్పుల సెగలు
నీ ఆలోచనలు అగ్ని శ్వాసాలు
నీ పాటలు కర్ణకఠోరం
నీ భాష బూతు పురాణం
నీ మాటలు గుండెల్లో గుబులు
నీ నాట్యం కోతి గెంతులు
నీ హృదయం రక్తపుటేరులు
నీ మనస్సు దయ్యాల కొంప
నీ ఊహలు బూతు చిత్రాలు
నీ ఆశలు ఆశ్చర్యంవేసే అడియాశలు
నీ ముఖం పగిలిన గాజుబొమ్మ
నీ కలలు పట్టపగలు వెన్నెలలు
నీ కళలు ఆత్మహత్యకై పోరు
నీ నటన మూగసైగల అడవిమనుషుల జీవనం
నీ రచనలు మూర్ఖుల భావాలు
నీ ప్రేమలు మితిమీరిన బెల్లం ముద్దలు
నీ శ్రమల వెల దొంగనోట్లతో చెరసాల
నీ తిండి గేదెలు మేసే గడ్డి
నీ తాగుడు పేగులు తెగుతున్న చప్పుడు
నీ సోమరి చమట లిక్కర్ దుర్వాసన
నీ ఆకలికి చీల్చుకుతినే పచ్చిమాసం
నీ జీవితం ఎండమావుల్లో ఈదటం

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *