ఆకాశం

ఆకాశం ఎందుకో ఎర్రబడ్డది
ఎవరో గోంతేత్తి అరుస్తున్నట్టు
శక్తి స్వరూపిణి తన నాలుకతో
నరకాసురుణ్ణి వదిస్తున్నట్టు
మరో అబలను హరిస్తున్నట్టు
మరో పుట్టిన పసికందును
చెత్తబుట్టలో వేస్తున్నట్టు
అమ్మాయిని బుట్టలో వేస్తునట్టు
పబ్బుల్లో రక్తాలు పారుతున్నట్టు
డ్రగ్స్ ముఠాలు కత్తులు నూరుతున్నట్టు
యువత నరాల్లో రక్తం ఎక్కిస్తున్నట్టు
మరో ప్రపంచానికి తెరతీస్తున్నట్టు
డబ్బులు లేక కుక్కిమంచంలో
తాత రక్తం కక్కుతున్నట్టు
ఫ్యాక్టరీ పొగల్లో ఊపిరి ఆడని కార్మికులు
మందు సీసాల్లో రక్తం మరుగుతున్నట్టు
కట్టెల పొయ్యిలో ఊది ఊది
గుండెలు అవిసినట్టు అలసిపోయినట్టు
వేరిక్కిన యువత బట్టలు చింపుకున్నట్టు
వీడియో గేముల్లో బతుకును రక్తం చిందుతున్నట్టు
ఆప్యాయత, అనురాగాలు కనుమరుగయినట్టు
కుటుంబాలు విచ్చిమైనట్టు, రక్త సంబంధాలు
కనపడకుండా పోయినట్టు
ఆకాశం ఎందుకో ఎర్రబడ్డది
భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *