నీలినీలి నింగి నిండా ప్రభాత పరంజ్యోతి దివ్యకాంతుల తేజస్సుతో భువిపై పసిడి ,ఎర్రచందనం సమ్మిళిత కాంతులు విరజిమ్ముతున్నాడు,,,,,,,,,
కొండలు, రహదారులను
నులివెచ్చని ఊదా వన్నె కిరణాలు స్పృశించగానే భువిపై సూర్యప్రభలతో శునిషిత సౌందర్యం పరచుకొంటున్నాడు సుప్రభాత సూరీడు,,,,,,,,
జీవకోటిని ప్రాణప్రదం చేస్తూ మానవ జీవన స్రవంతులకు సప్తవన్నెల సమ్మిళిత కిరణాలు మౌనవీణపై సప్తస్వరాలతో మేల్కొలుపు గీతాలు ఆలపిస్తూ,,,,,,,,,,,,,
అవనిపై జీవజాలములు ,వృక్షజాలములు జీవం ఉత్తేజమయి వెచ్చవెచ్చని కాంతులలో జీవనతంత్రులు మీటును ,,,,,,,,
పచ్చపచ్చని పైరులు శశ్యశ్యామలములవును భానుడి వాడి కిరణాల తాకిడికి ఉపిరిపోసుకుని దన్యమవును .ప్రతినిత్యం నెమ్మది నెమ్మదిగా పంటల సిరులతో అలరారును, రైతుల శ్రమలు సాఫల్యమవును,,,,,,,,,,
తెలతెల వారగానే గుండె లయలలో మనస్సు, శరీరం బడలికను వీడి నులివెచ్చని కిరణాలలో నవజీవన గారడీల లోకంలో శ్రామికులు, కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు సమస్తం పరుగుల జీవితాలలో రోజువారి పనులను మొదలిడి శ్రమల చిత్రాలను సృజియించే కళానేర్పరులు,,,,,,,,
సంపన్నులు కారులలో, ఇతరత్రా వాహనాలలో పయనిస్తూ తమ వృత్తులలో, ఉద్యోగాలలో బిజీబిజీగా బ్రతుకులు,కొందరు నుదుటిపై బ్రహ్మరాతలను చెరుపుకున్న దళారులు రహదారుల పక్కన భవంతులు నిర్మించుకుంటారు గారడీల లోకంలో,,,,,,,,,,
సూర్యభగవానుడు అవని అంతా చిందించే కిరణాలతో సమస్తం గ్రహించే కోట్లకొలది కళ్లున్న పర తమ భేదాలు లేని సృష్టికర్త ఆ పరమాత్మ,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట