రక్తవర్ణ సూరీడు,,,,,,!!

బ్రతుకు పుటలు ఎండిన మంటల్లో రక్తసిక్తమవుతున్న విషాద రాగాలు
లోకమంతా ఎర్రగులాబీలు పూస్తూ రక్తకన్నీళ్ళు వర్షిస్తున్న జనం హృదయాల ఘోష
తొలిపొద్దు మలిపొద్దు మద్య జనం చీడ కళ్ళల్లో పొంగుతున్న కల్మషాలు అరాచకాలు కుతంత్రాలతో నాటక కీచకుల హత్యలు అత్యాచారాలు
పగిలిన గుండెల ఆక్రందనలలో అగ్నిపూవుల అక్షరాల రోదనా గీతాలు అవిసిపోయిన గళాల్లో….. ..
కన్నీళ్ళు ఉబికే కళ్ళల్లోంచి రక్తం రంగరించి తీసి ట్యూబుల్లో నింపి వ్యక్తిత్వ నిర్దారణచేసే డబ్బు గుండె చప్పుడు రోగులు వైద్యులు
లోకమంతా ఎర్రని గుండెల మంటల్లో కుదేలవుతుంటే రాజకీయ నాయకులు ఓట్ల డబ్బాల నిండా డబ్బులతో జనం రక్తం పిండుకుంటూ నిశాలో వదురుబోతులేలే లోకం పోకడ……
ఆకులు పూవులు రాలిన వృక్షాలు కటిక దరిద్రుల లోకంలో పశుపక్ష్యాదులను పీక్కుతింటూ రక్తసిక్తమవుతున్న పారే సెలయేర్లు రక్తం పండే పంటలు ,,,,,,,,,
సూర్యోదయాలు ఎరుపెక్కిన ఆకాశం నిండా రక్తాక్షరాలు అగుపించని లోకానికి రాసే కవిత్వం కొందరికే నా లోతైన హృదయం ఆనవాళ్లు తెలిసేది చాలు……..
కూలిపడుతున్న కొండ చరియల్లా రక్తం పూసుకున్న రహదారులు విరిగిపడుతున్న మనుష్యులపై దూసుకెళ్లే వాహనాల హాహాకారాల్లో ఢీకొడుతున్న కపాళాలు క్రూర కబంధహస్తాల్లో నలిగిపోతున్నాయి……..

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *