ప్రపంచ తపాలా దినోత్సవంను ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాపంగా అక్టోబరు 9 న జరుపుకుంటారు. స్విట్జర్లాండ్ లోని బెర్న్ లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) స్థాపనకు గుర్తుగా, ఇది స్థాపించిబడిన అక్టోబరు 9 న ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు రాయడానికి అనుమతించే గ్లోబల్ కమ్యూనికేషన్స్ విప్లవం యొక్క ఆరంభం.
1969 లో టోక్యో, జపాన్లో జరిగిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సమావేశంలో మొదట ఈ ప్రపంచ తపాలా దినోత్సవం ప్రకటించబడింది.భారత ప్రతినిధి బృందంలో సభ్యుడైన శ్రీ ఆనంద్ మోహన్ నరులా ఈ ప్రతిపాదనను సమర్పించారు. అప్పటి నుండి, తపాలా సేవల అవసరాన్ని గుర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 9 న ఈ ప్రపంచ తపాలా దినోత్సవమును జరుపుకుంటున్నారు.
ఇంటర్నెట్, ఇమెయిల్ కమ్యూనికేషన్ కొత్త మార్గాలు ఉన్నపటికీ, పోస్టల్ సేవలు ఇప్పటికీ ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్, ఈ-కామర్స్ విస్తరణతో పోస్టల్ సేవల వినియోగం నిజానికి పెరుగుతోంది. పోస్టల్ సేవలు వస్తువులను పంపిణీ చేయడమే కాకుండా.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ ఆర్థిక సేవలను కూడా అందిస్తాయి. తపాలా సేవలు ఆధునిక సమాజానికి కమ్యూనికేషన్ కు పురాతన, అత్యంత విశ్వసనీయ మాధ్యమం. డిజిటల్ యుగం రాకముందు, ప్రజలు పరస్పరం సంభాషించుకునే ఏకైక మార్గం పోస్టల్ సేవలు. ఈ సేవ వ్యక్తిగత సందేశాలను మార్పిడి చేయడానికి మాత్రమే కాకుండా వ్యాపారం అలాగే ప్రభుత్వ సమాచారాన్ని సురక్షితంగా ప్రసారం చేయడానికి కూడా మాధ్యమంగా ఉంది.
భారతదేశ తపాలా చరిత్ర అనేక శతాబ్దాల నాటిది, చంద్రగుప్త మౌర్య వంటి చక్రవర్తుల పాలనలో నిర్మాణాత్మక తపాలా సేవలు స్థాపించబడ్డాయి. అయితే, భారతదేశంలో వారి పాలనలో బ్రిటిష్ వారు తపాలా వ్యవస్థను అధికారికం చేశారు. భారతీయ తపాలా వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది మరియు అత్యంత సమర్థవంతమైన వాటిలో ఒకటిగా మారింది, ఈ ప్రత్యేకతను నేటికీ నిలుపుకుంది.
భారతదేశంలో నేడు మనకు తెలిసిన నిర్మాణాత్మక తపాలా వ్యవస్థను 1854లో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టారు. తపాలా రేట్లను ప్రామాణీకరించడం, తపాలా స్టాంపులను ప్రవేశపెట్టడం మరియు ఉపఖండం అంతటా తపాలా మార్గాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆధునిక తపాలా వ్యవస్థకు పునాది వేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. 1854 నాటి ఇండియా పోస్ట్ ఆఫీస్ చట్టం తపాలా వ్యవస్థ మరియు దాని సేవలకు చట్టపరమైన చట్రాన్ని నిర్దేశించింది, ఇవి స్వాతంత్ర్యం తర్వాత మరింత విస్తరించబడ్డాయి.
మాధవి కాళ్ల
సేకరణ