ఒక క్లాస్ వాళ్ళు ఇలా అడిగారు,
క్లాస్ లో ఒకరికి టాప్ ర్యాంక్, ఇంకొకరికి లీస్ట్ ర్యాంక్ కాకుండా అందరికీ ఒకటే సమానమైన ర్యాంక్ ఇవ్వండి అన్నారు, OK అన్నాను…
మీ అందరి మార్కులు కలిపి average తీసి క్లాసు మొత్తానికి ఒకే రాంక్ ఇస్తా అన్నాను.
మొదటి సెమిస్టర్లో average ర్యాంక్ “B” వచ్చింది అందరికి,
2 nd సెమిస్టర్లో అందరికి “D” ర్యాంక్ వచ్చింది,
3rd సెమిస్టర్ లో అందరికి “F” వచ్చింది,
ఫైనల్ exams లో అందరూ ఫెయిల్ అయ్యారు,
స్టూడెంట్స్ అందరూ అవాక్కయ్యారు,
బాగా కష్టపడి చదివేవాళ్ళు… ఎవరికోసమో మేము చదవడమెందుకు అని చదవటం మానేశారు,
చదువు మీద శ్రద్ధ లేనివాళ్ళు… ఎలాగూ తెలివికల వాళ్ళు చదువుతారు కదా, ఇక మేమెందుకు చదవటం అని చదవటం పూర్తిగా మానేశారు,
ఈ ప్రయోగంలో నాలుగు విషయాలు తేటతెల్లమవుతున్నాయి.
- చట్టం ద్వారా పేదవాడిని సంపన్నుడిగా చేయలేము,
కానీ అదే చట్టం ద్వారా సంపన్నుడిని పేదవాడిగా చెయ్యొచ్చు. - ఒకరు ఏదైనా ఉచితంగా పొందుతున్నారు అంటే మరొకరు ఆ ఉచితం ఇవ్వటం కోసం కష్టపడుతున్నారు,
- గవర్నమెంట్ ఏదైనా ఉచితంగా ఇస్తుంది అంటే,
ఎవరి దగ్గరనుండో ఆ ఉచితానికి కావలసిన కష్టాన్ని తీసుకుంటుంది. - ఉన్నది పంచుకుంటూ పోతే సంపద సృష్టి జరగదు,
కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి.
సగం మంది ప్రజలు మేము కష్టపడటం ఎందుకు…
అన్నీ మాకు ఉచితంగా వస్తున్నాయనుకుంటే…
మిగతా సగం కష్టపడి ఉచితాలకి కావలసినవి సమకూర్చుతున్నారు,
ఈ కష్ట పడేవాళ్ళు ఎందుకు మాకీ కష్టం… ఎవరినో కూర్చోపెట్టి మేపటానికి అని, కష్టపడటం మానేస్తే,
అక్కడే దేశ వినాశనానికి బీజం పడుతుంది…
పార్టీలకతీతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి…
నలుగురితో చర్చించండి…తప్పుని నిర్భయంగా అందురు ప్రశ్నించండి
మన
భావితరాల కోసం
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల