రాత్రి నాకు నిద్రలో
వచ్చిన స్వప్నంలో
నా కవితల అక్షరాలన్నీ
గాలిలో తేలియాడుతూ
సన్నని కన్నీటి చినుకులు కురుస్తూ
నా కవితలన్నీ ఆత్మ జ్యోతులై
అప్సరసలు ఆత్మతత్వ
రసరమ్య గీతాలు ఆలపిస్తున్నాయి
వినీల గగనం శోభిళ్ళుతోంది
నీ దుఃఖిత జీవితాన్నంతా
అంతర్ముఖునివై ఆత్మీయంగా
ఆత్మజ్యోతి వెలుగులో
సౌందర్య గీతాలు లిఖించి
వినీల గగనం నిండా
గాలిపటాల్లో ఎగరేయి
ఆలపించడానికి మేము సిద్ధం
అందుకే ఆత్మ జ్యోతిలా వెలగనీ
నిరాశ ఎల్లప్పుడూ నీడలానే మిగలాలి
అని ప్రభోదించిన అనంతకోటి
నక్షత్రాలలో అంతర్థానమైనాయి,,,,,
అప్సరసలు,,,,!!
అపరాజిత్
సూర్యాపేట