బాలికలు లేని ఇల్లు
బోసిపోయిన ముల్లు
బాలికలు ఉన్న ఇల్లు
వసంతాల చిరు జల్లు!
బాల బాలికలు లేని లోగిలి
అథిదులు మెచ్చని వాకిలి
భక్తితో చేసిన పూజలకు
వరప్రసాదాలే ఈ పిల్లలు!
బోసిపోయిన ఇంట
ముత్యాల పంట
పిల్లల నవ్వులు అంట
అది ఆనందాల వెల్లువంట!!
ఇది నా స్వంత రచన .
ఉమాదేవి ఎర్రం..