తొలి కిరణం లాంటి చిరునవ్వుతో
గలగల పారే సెలయేరులా
గాజుల చప్పడితో ఇల్లంతా తిరుగుతూ
మువ్వల సవ్వడితో సందడి చేస్తూ
పువ్వులా ఎప్పుడు వికసిస్తూ
నీ రాకతో మొదలవుతుంది ఆనంద నిలయం
ఆమె లేనిదే చిరునవ్వుల లోకం లేకుండా పోతుంది
ఎన్ని ఒత్తిడులు ఉన్న కల్మషం లేని నవ్వుతో
ఎదురొచ్చి మరి పలకరిస్తూ ఉంటే
మదిలో ఉన్న అలసట అంతా మంచులా కరిగే
దేశానికి వెన్నుముకలా నిలిచిన రైతున్న ఎలాగో
ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆమె వెన్నుముక
అందరినీ అమ్మలా చూసుకుంటూ
అందరి నోట్లో నాలుకలా నిలిచిపోతూ
చదువులో తన సత్తాని చాటుతూ
తన అల్లరితో ప్రపంచాన్నే మరిచేలా చేస్తూ
ఎన్నో బంధనాల మధ్య ఉన్న కూడా
ఎన్ని పరిమితులు తనకి పెట్టిన కూడా
పువ్వులా వికసిస్తూ అందరిలో కలిసిపోతూ
ఆకాశమంత ఎదగాలి అన్న సంకల్పంతో
ఆమెకి ఎల్లప్పుడూ ధైర్యాన్ని ఇస్తూ
తనలో ఉన్న భయాన్ని పోగొడుతూ
ఎవరి తోడు లేకుండా తన జీవిత ప్రయాణం
ఒంటరిగా ఎల్లప్పుడూ కొనసాగించాలని
బాలిక ఓ బాలిక నీ సత్తాని చాటుకో…
నువ్వు లేని ఇల్లు దీపం లేని గుడి లాంటిది
వెలుగు లేని చీకటిలో జాబిల్లి నువ్వు
నక్షత్రాల లాంటి నీ నవ్వులతో
ఈ లోకంతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా
గగనమంత నీ ప్రేమను పంచాలి..
మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ కవిత నా సొంతం అని హామీ ఇస్తున్నాను..