ఎటు పోయెనో ఆ మానవత్వం.
పట్టపగలైన ఆడపిల్ల ఒంటరిగా నడిచే పరిస్థితి లేదు.
కామాంధులు వీధి కుక్కల్లా వెంట పడుతున్నారు.
ఆ వీధి కుక్కలను పెంచుతున్నది ఒక ఆడదే అచ్చోసిన ఆంబోతులను తయారు చేస్తున్నది తల్లులే .
మగవాడు అనే ఒక కిరీటాన్ని పెట్టి అహం నింపి పోషిస్తున్నారు.
అంతే వాడికి కన్ను మిన్ను కానక మంచి చెడుల తత్వం గ్రహించక !
ఆడపిల్ల కనపడితే ఆంబోతుల మారిపోతున్నాడు విచక్షణ కోల్పోతున్నాడు.
అలాంటి వారిని చూసి ఆడపిల్లలు గడగడా వనికి పోతున్నారు.
ఏ వ్యవస్థలోనూ ఆడవారికి రక్షణ లేదు.
ఎన్నని తెలపాలి కన్నతల్లిని కూడా చంపగలిగే స్థాయి మగపిల్లలు దిగజారుతున్నారు !
అంటే మగ పిల్లలును ఏ విధంగా తల్లులు పెంచుతున్నారో .?
నువ్వు మగవాడివి నువ్వు మగవాడివి అంటూ లేని పోనీ పౌరుషాన్ని వారిలో కూర్చి !
జ్ఞానం అనే దీపాన్ని ఆర్పి వేస్తున్నారు కొందరి పిల్లల్లో.
కడెవెడి పాలను ఉప్పుకల్లు విరగొట్టినట్లు ఒకడుంటే అందరికీ చుట్టుకుంటుంది.
ఆడపిల్లకు మనుగడ లేకుండా కొందరు కంకణం కట్టుకుంటున్నారు.
మీ పిల్లలకు కోట్లు కూడా పెట్టి ఇవ్వకండి.
జ్ఞానకోటిని అందించండి సమాజంలో మీరు ఆనందంగా ఉంటారు.
మీ పిల్లలు ఆనందంగా ఉంటారు సమాజము ఆనందంగా ఉంటుంది.
పిల్లలు సక్రమమైన పద్ధతిలో పెరుగుతుంటే.
ఏ ఆడపిల్ల భయపడే పరిస్థితి ఉండదు.
ఒంటరిగా వెళ్లకండి మహాలక్ష్ములు మీరు .
మీ జీవితం కనకాంబరం కడు జాగ్రత్తగా ఉంటేనే అంబరాన్ని ఆస్వాదించగలుగుతారు.
ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి
నా స్వీయ రచన నా హామీ