కం!!💐💐💐

ఆశయ సాధన కొరకై
ఈశునిపై ధ్యాస బెట్టి యిచ్ఛగ సాగన్
నాశనమగు పాతకముల
రాశులు నెన్నైన గాని రయమున కృష్ణా!!

గాడిద యోండ్రను బెట్టిన
వేడుక చేయంగ గూడు వెధవలు, జూడన్
పాడిగ గర్జించు హరిని (సింహము)
తాడించుచు తరిమిగొట్టు ధరణని కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *