వరదల్లో తల్లిదండ్రులు పోయిన అక్కాతమ్ముళ్ళు
అక్క తాను చదువు మధ్యలో మానేసి
బ్రతుకు తెరువుకు తన అయ్య తొక్కిన రిక్షాయే ఆసరా అయ్యింది,,,,,,,,
తన తమ్ముడు బడి మొహం ఎరుగని చిన్ని పిల్లాడు
రోజు ధనికులను రోగగ్రస్తులను వాళ్ళ చిరునామాకు రిక్షా ఎక్కించుకుని తొక్కుతుంటే,,,,,,,
తన వళ్ళు గుల్లగుల్లయై ఆకలికి అల్లల్లాడే తను తమ్ముడు ఇంతముద్ద తిని పడుకుంటే, అమ్మా అయ్యా కళ్ళల్లో మెదిలి తను తమ్ముడు పలవరింతల నిద్ర,,,,,,,,,
తమ జీవితాల అగ్నిగుండాల్లో నిలువెత్తు సాక్ష్యం ఆ రిక్షా,,,,,,
నా అనే వాళ్లంతా అయ్యో అనడం తప్ప ఏ సహకారం అందించరు,,,,,,,,
తన తమ్మున్ని సర్కారు బడిలో చేర్పించేందుకు రిక్షా ఎక్కించుకుని తీసుకెళ్తుంది,,,,,,,,,
అయ్య అమ్మ కూలీ చేసైనా తనను ప్రయివేటు బడిలో చదివించేవారు,,,,,,,,
రిక్షా తొక్కుతూ తన ఎదురుగా దాటేసి వెళ్తున్న పెద్ద రిక్షాలో తనతో చదువుకున్న స్నేహితులు తనను చూసిచూడనట్లు బడికి వెళ్తుంటే గుండెల్లో గెలికినట్లయ్యింది,,,,,,,,
ఏం చేస్తాం విధి రాసిన రాతను మార్చలేనిది,,,,,,,,
దుఃఖపు ఆలోచనలు గిర్రున తిరుగుతుంటే రిక్షా తొక్కుతూ ప్రభుత్వ బడిలో చేర్పించింది,,,,,,,,
సాలోచనగా రిక్షా తొక్కుతుంటే ఓ రిక్షా అమ్మాయి ఆగు ,,,,,,,,,,గగన్ పేటకు ఏం తీసుకుంటావ్,,,,!అంటూ బేరమాడుతున్నాడు,,,,,,,,,
జనాలను వాళ్ళ చిరునామాలకు చేర్చే ఎడారి లోకం ఓడ అయ్యింది,,,,,,,,!
ఇది నిశ్శబ్ద యుద్ధం మాత్రమే ఇది మరువకు,,,,,,,!
అపరాజిత్
సూర్యాపేట