రైతు. *****ఆటవెలదులు *

ఉరుములు, మెరుపులకు, ఉగ్రపిడుగులకు
దడియకుండ పొలము జనుచు రైతు
కీచురాళ్ళ మధ్య కేదారమును నమ్మి
ప్రాణ గండమున్న పనులుజేయు!

జూదమాయె బ్రతుకు జోరువానల తోటి
కంట నీరునిండె పంట మునుగ
పంటనమ్మునపుడు ఒంటరాయెను రైతు
మద్దతు ధర లేక మరణమందె !

కాయకష్టములను కఠినమంచెరుగడు
ఎంత కష్టమైన యెదురుకొనును
ఎండ,వాన, చలిని యెంతైన భరియించి
అన్నమిచ్చు మనకు యతడె “రైతు” !

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా………

                      ............ కోట .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *