ప్రాధమిక విద్య విద్యార్థికి పునాది మెట్లు,,,,,,,!!

చిన్నారీ అమాయక నవ్వుల పొన్నారీ
జాబిలి పువ్వుల వెన్నెల ముఖీ
కలలు కనే కళ్ళల్లో ఆశల భవిత భూమికయై
కళ్ళ నిండా అక్షర సముద్రాల కెరటాలు
గణిత సమస్యల అంకెల గారడీలు
బడిలో కాలాన్ని విడగొట్టి మరీ బోధించే పాఠాలు
మనస్సు అక్షరాల అంకెల కలగూరగంప
భూమ్యాకాశాల మద్య కూర్చోబెట్టి సైన్స్ టీచర్ పాఠాలు
శరీరధర్మశాస్త్రాన్ని విడమర్చి చెప్పే టీచర్
భౌగోళిక చారిత్రక జ్ఞాన సముపార్జన ఓ ప్రహసనం
ఉవ్వెత్తున ఎగిసిపడే ఆలోచనలు పునాది మెట్లు
కలంతో రాస్తూ కళ్ళల్లో ఊపిర్లు పోసుకుంటూ
చదివే పుస్తకం జిజ్ఞాసకు మేధోన్నతికి మూలం
టీచర్ బోధనలో విద్యార్ధి ప్రత్యక్షంగా పాల్గొంటేనే అర్ధవంతం
చదువుల సముద్రంలో విద్యార్థిని సమర్థున్ని చేయడమే లక్ష్యం కావాలి
మార్కులు ర్యాంకులు నాలుక గీసుకునే పుల్లతో సమానం
విద్యార్థి సమగ్ర అభివృద్దే టీచర్ లక్ష్యం కావాలి
విద్యార్థి అభివృద్ధికి ఏ కొలమానాలు అవసరం లేదు
విద్యార్థుల మధ్య పోటీ తత్వం ఆశాస్త్రీయం హేయం కూడదు
చిన్ననాడు అంతరంగంలో నాటుకున్న ఏ భావాలు వృధాపోవు
ఆటపాటలతో ప్రాధమిక విద్య ఆహ్లాదాల ఉల్లాసం పరమానందం

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *