కం!!🚩🚩🚩

ప్రతిభకు పట్టము గట్టిన
ప్రతిభావంతుడు మరింత ప్రగతిని జూపున్
ప్రతిభను తోక్కిన వేళను
ప్రతిభను చూపంగ బోవు పరదేశముకున్!!

వెలిగించగ దీపాలను
నెలకొన్నట్టి తిమిరమ్ము నిర్వీర్యమవన్
కళకళ లాడుచు వెలుగుల
కిలకిల నవ్వులు వెలయును గృహమున కృష్ణా!!

అభినవ శివాజి మోదీ
విభవమ్మును జూప వచ్చె వేగను మోదీ
అభిమాన ధనుడు మోదీ
అభయము తానిచ్చు మోది యాత్ముడు కృష్ణా!!

నరకుడు బెట్టిన బాధల
నారాయణ మూర్తి దీర్చె నాడే చూడన్
నరరూప రాక్షసులనిల
నరకంగా వచ్చె మోది నరునిగ కృష్ణా!!!

చుట్టినను పట్టుబట్టలు
పెట్టిన కనకంపు నేడు పేటల గొలుసుల్!
కట్టినను మేడ మిద్దెలు
కట్టెల మంచంమ్మె దిక్కు కడకును కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *