అక్షరలిపి కొరకుఅంశం – ప్రయివేటు ఉపాధ్యాయుల బాధలురచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – పరుగు సమయం

ఉదయం లేవాలంటేనే
బద్దకంగా ఉంటుంది కనీ
లేవకపోతే సమయమే
సరిపోదు!

లేచి పరుగులు మెుదలైతే
కానీ అందుకో లేని పరిస్థితి
శ్రీవారిని ఆఫీసుకి పిల్లలను
స్కూలుకి ఆ తరువాత తను!

తన కోసం గడియారం
ఆగదు కదా! అదే సమయం
అదే రొటీను టీచరే లేటుగా
వెళ్తే స్టూడెంటు పరిస్థితి!

అని హెచ్ ఎమ్ తో చివాట్లు
ఉంటుందో! ఊడుతుందో!
తెలియని ఉధ్యోగం చాలీ
చాలని జీతభత్యం!

ప్రయివేటంటే ప్రయివేటే
మరీ ఆడవాల్ల స్థితి ఇంట్లో
భయపడడమే బయటా
భయపడడమే!

ఏమైనా బాధ చెప్తే మానేయ
మంటాడు భర్త చెప్పకపోతే
నిద్రపోనంటుంది మనసు
మానేయకంటుంది చదివిన చదువు!

ఇది నా స్వంత రచన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *