శీర్షిక : స్నేహంస్నేహమా ..
అక్షరామృతదారలు వొలుకుతు తాకింది మనసు..మన హృదయాల్లో తేనె చిలుకుతూ పల్లవించే కవితగా.అంజలి గట్టించి ఆస్వాదిస్తున్న మనసులో ఆ సాంత్వన ..ప్రతి క్షణం గీతమై మధుర భావమై సాగాలి సామీప్యంనీ నవనీతమైన మాటలు,నా హృదయ రాగములు,ఆ రాగమాలికలే సుమగంధ మధుర భావలు…బృందావనంలో తరువుల పూ పరిమళాలు ఊసులు …ప్రజ్వలించే పరిభ్రమించే ప్రియసఖి దివ్య కాంతులు…ఈ ఉత్సాహం, ఊహ, అనుభూతితో,మన స్నేహ పల్లకీపై ఊరేగుతున్నా ఆనందరాగమై..ఎంతెంత దూరాలైన మనస్సుకు సమీప్యాలే భావం.సహచరి ఈ బంధం మన స్నేహం బంధం..హృదయ వేదికపై ప్రతిధ్వనిస్తాయి కోయిలలై…నేస్తమా, నీ స్నేహం నా జీవిత గీతం,జ్ఞానామృతం, శాంతి శ్వాసల మధురానుభూతులకే కైవసం.ప్రతి క్షణం, ప్రతి పలుకు, మన స్నేహం గీతమై !హృదయ వేదికపై ఆశయపు వెలుగుల చైతన్య రాగం…
ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి నా స్వీయ రచన నాహామీ..