అమ్మాయి నవ్వులో
ఎన్నో ఎన్నెన్నో అందాలు
అది కొంత కాలమే!
ఇక తన జీవితానికి ముడి
పడిన బంధాలతో ప్రపంచమే
కనపడదు తనది అదో లోకమే
ఆ తరువాత బల పడిన బంధాలతో జీవితమంతా నవ్వులు మాయమే!
కష్టాల కడలి లో ఓలలాడాలి
ఏదీ తనది కాదు ఏ ఆస్తులూ తనవి కావు ఏ ప్రేమలూ తనకు పంచరు ఏదో కొందరి అధృష్టం బాగుంటే దొరుకుతుంది కొంత ప్రేమ!
ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చినా ఎన్ని ఇళ్లులు మారినా ఏ ఇళ్లూ తనది కాదు ఏ నవ్వులూ తన స్వంతం కాదు చివరకు చితే తన స్వంతిల్లు!
ఆడవాల్లను ఎందుకు సృష్టించాడో ఆ దేవుడు?
ఆ ఆడది లేకుంటే సృష్టే లేదు అంత మందిన సృష్టించిన స్త్రీ మాత్రం తనకంటూ ఏదీ లేకుండానే తనువు చాలించాలి!
ఉమాదేవి ఎర్రం..
ఈ రచన నా స్వంతమే!