తల్లి ప్రేమ

ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయి, అమ్మాయికి పెళ్ళి చేసి పంపారు కానీ ఆమె అదృష్టం బాగాలేదు ఆమె భర్త చనిపోయారు దాంతో ఆమె తిరిగి పుట్టింటికి చేరింది చేతిలో బాబుతో.. ఆ తర్వాత భర్త చనిపోయిన ఆ అమ్మాయి పనిచేస్తు తన కొడుకును చూసుకుంటూ బతుకుతుంది. ఇంతలో తండ్రి చనిపోయారు. అప్పుడు తల్లికి ఉద్యోగం వచ్చింది. కానీ తల్లి ఆ ఉద్యోగం తీసుకోకుండా తన చిన్న కొడుక్కు ఇప్పించింది. ఆ ఉద్యోగం నిలుపుకోవాడానికి ఆమె చాలా డబ్బులు ఇచ్చింది. ఎన్నోసార్లు ఆ మూడో కొడుకు చేసిన అప్పులు, క్రెడిట్ కార్డు బిల్లులు కూడా కట్టింది. వేలకు వేలు అప్పు లు చేసినా అయ్యో నా కొడుకు అనుకుని ప్రేమతో అప్పులన్నీ తీర్చేసింది. తర్వాత ఆ కొడుకు ఒకమ్మాయి ప్రేమించినా అంటే సరే అని డబ్బులన్నీ ఖర్చులు పెట్టి అమ్మాయికి బంగారం, బట్టలు, వెండి తో పాటు ఆ అమ్మాయికి బట్టలు కూడా కుట్టించి, పెళ్ళి చీరతో పాటు తమ బట్టలు కూడా ఇచ్చి పెళ్ళి చేసింది. పెళ్లయిన వారం రోజులు అమ్మాయి బాగానే ఉంది. కాకపోతే నాకు ఏ పనులు రావు అంది సరే మెల్లిగా నేర్చుకుంటుంది అనుకుంది ఆ తల్లి కానీ వారం అయ్యాక ఏదో మాట అన్నారు అని పెళ్ళికి పెట్టించిన గాజులు పగలగొట్టుకుని గొడవ చేసింది. దాంతో పాటు మాకు మీకు సెట్ అవదు మీరూ వేరే ఉండండి అని అంది తల్లి పాపం ఎందుకమ్మా అలా అంటావ్ అంటే అత్త ను కాలితో తన్నింది. దాంతో షాక్ అయిన ఆ తల్లి కి ఏమి అర్ధం కాలేదు. దాంతో పాటు కొడుకు కూడా పెళ్ళానికి వత్తాసు పలకడం తో ఏమి చేయలేక అన్నిటికి సర్దుకుపోతు ఇంటికి అన్నీ విధాలుగా సామాను, కిరాయి కడుతు, అలాగే తన కొడుకు అడిగినప్పుడల్లా డబ్బులు కూడా ఇస్తూ ఉండేది. అలా చాలాసార్లు గొడవలు అయ్యాక నాకు కడుపు వచ్చింది అని నాటకాలు అడి, ఇంట్ల ఉన్న ఆడపడుచు, ఆమె కొడుకు తో చాకిరీ చేయించుకుంది అయ్యో గర్భవతి కదా అని ఆమెకు అన్నీ విధాలుగా సేవ చేశారు. కానీ చివరికి ఆ గర్భం నాటకాలు అని తెలిసిన కూడా ఏమి చేయలేని పరిస్థితి ఆమె కొడుకు తో మాట్లాడాలి అన్నా కూడా భార్య కు భయపడి మాట్లాడడం మానేశాడు. ఇదంతా తల్లికి ఎంత క్షోభ పడుతుందో ఆలోచించండి. కనీసం ఆ అమ్మాయి అయిన నేను ఏమి తీకుండా వచ్చాను వీరికి కృతజ్ఞతగా ఉండాలి అని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేశారు. పాపం ఆ తల్లికి మాత్రం కేసులు పెడుతుంది అని భయపెట్టారు. చివరికి ఆ తల్లి నీ, ఆడపడుచు నీ ఇంట్లోంచి వెళ్లగొట్టి, ఆమె భర్త అంటే తండ్రి కొన్న ఇల్లుని కూడా అమ్మేసి ఆమెకు నిలువ నీడ కూడా లేకుండా చేశారు. ఇల్లు లేకుండా ఇప్పుడు ఆమె ఆమె కూతురు తో పాటు అద్దెయింట్లో ఉంటుంది. ఇప్పుడు ఆ తల్లి కొడుకు కోసమే త్యాగాలు చేసింది. అంటే ముగ్గురు పిల్లల కోసమే తాపత్రయం చెందితే చివరికి ఆమెను రోడ్డున పారేసి నీదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదేంత వరకు సమంజసం. పోని ఆడపడుచు అంటే వేరే కానీ తల్లి పోతే తిరిగి రాదు కదా ఆమె చేసిన త్యాగలన్ని మర్చిపోయి. కేవలం డబ్బులు కోసమే ఆమెని హింసిస్తున్నారు శారీరకంగా, మానసికంగా ఆమె క్రుంగిపోతుంది. తల్లిగా ఆమె చేసింది తప్పా, కొడుకులు పున్నామా నరకం నుండి తప్పిస్తారు అని కని పెంచి పెద్దచేస్తే చివరికి ఆమెకు మిగిలింది ఏమిటీ? ఆత్మభిమానం ఆమెకి కూడా ఉంటుందని ఎందుకు ఆలోచించరు? ఆమె శాపాలు తగులుతాయి అని ఎందుకు అనుకోరు. కొడలి ముందు కొడుకు ఎలా పడితే అలా మాట్లాడితే ఆమెకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? ఎన్నో విధాలా రక్షించిన ఆమెని కోడలికి భయపడు అని కొడుకు అనడం లో అర్ధం ఉందా? పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టుకొని మగాడు ఒక మగాడేనా? ఇవన్నీ పక్కకి పెడితే అయ్యో నా తల్లి నన్ను ఎన్నో విధాలుగా రక్షించింది నా అప్పులు తీర్చింది ఈ వయసులో ఆమెని కష్టపెట్టకుండా చూసుకోవాలి అనే ఇంగీత జ్ఞానం లేని కొడుకు ఒక కొడుకేనా ఒకప్పుడు నా కుటుంబానికి నేను అంకితం అన్నవాడు ఇప్పుడు ఇంతగా మారడానికి కారణం ఆ అమ్మాయి కాదా? ఆమె వచ్చాకే ఇవన్నీ జరిగాయి. భర్త కొనిచ్చిన ఇల్లు అమ్మినా కూడా అయ్యో నా పిల్లలే కదా అని ఊరుకోవడం ఆమె తప్పా, ఒకే ఇంట్లో అందరం కలిసి ఉండాలని కోడలు సేవలు చేయాలనీ కోరుకోవడం తప్పు అంటారా, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పెద్దలు చేసిన పెళ్ళిలో కొన్నిసార్లు తప్పులు చేసినా ఇరువైపులా కూర్చుని చెప్తారు. కానీ ప్రేమ పెళ్ళిలో ఇవన్నీ ఉండవు అని చెప్పాడానికి పైన చెప్పిన కథనే సాక్ష్యం. అది కథ కాదు ఒక తల్లి ఆవేదన. ఇష్టపడి ఎంతో ఖర్చు పెట్టి పెళ్ళి చేస్తే సంవత్సరం తిరగకుండా తల్లిని, అక్కను, ఇంట్లోంచి వెళ్లగొట్టేవరకు ఊరుకోలేదు ఆ అమ్మాయి అంటే వారిని వెళ్లగొట్టి తన వారిని తెచ్చుకోవాలి అనే ఉద్దేశ్యం తోనే కదా ఇవన్నీ చేసింది. మానసికంగా, శారీరకంగా బాధలు పెడితే వెళ్ళిపోతారు అని ప్లాన్ చేసే ఇద్దరూ కలిసి వెళ్లగొట్టారు. ఇప్పుడొక మాట ఇది కొంచం కఠినంగా ఉన్నా ఇదే చెప్పాలి పెళ్లయి భర్త వదిలేసిన వదిన ను తెచ్చుకుని ఉంచుకుంటాడా, వదినతో పాటు అత్తా మామను తెచ్చి ఉంచుకుంటావా అని అడిగితే ఎంత నామోషీగా ఉంటుందో ఆలోచించాలి. కానీ ఆ తల్లి ఆ మాట అనదు. ఎందుకంటే ఆమెకి ఒక కూతురు ఉంది. ఆమెకి సంస్కారం ఉంది కాబట్టి ఇన్ని చేసినా ఇంకా నా కొడుకు బాగుండాలి అనే కోరుకుంటుంది అదే తల్లి మనసు. అది అర్థం చేసుకొని కొడుకు ఒక కొడుకు కాదు వాడు ఉన్నా లేనట్టే, ఇడ్లీ కొట్టు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది తల్లిదండ్రులను సరిగ్గా చూసుకొని వాడు నాశనం అవుతాడు అని ఇదే నిజం కూడా, పెళ్ళాం మాట విను వద్దు అనడం లేదు అదే సమయంలో తల్లికి కూడా విలువ ఇవ్వాలి కదా? ఆ కొడుకు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరూ ఏమి అనుకుంటున్నారో అనేది మీ అభిప్రాయం లో తెలపండి. అలాగే ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పండి. మీరు ఇచ్చే విలువైన అభిప్రాయం మాకు ముఖ్యం. ప్రేమ పెళ్ళిలో కూడా ఇన్ని కష్టాలు ఉంటాయని చెప్పడానికే ఈ కథ మీ అభిప్రాయం తప్పకుండా తెలుపుతారని ఆశిస్తున్నాను…

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *