చిత్రమైనది ఆకాశం
చిత్రాలు గీస్తుంది
విచిత్రాలను వీస్తుంది
భద్రమైనది ఆకాశం
రహస్యాలను దాచుకొంటుంది
హాస్యాలతో అడ్డుగోడలు దాటేస్తుంది
విశాలమైనది ఆకాశం
దేనికి వీలులేదంటుంది
వీసమెత్తు అవకాశం కూడా ఇవ్వనంటుంది
వదిలేస్తాడా మనిషి
పడిలేస్తూనే అన్వేషియై
బుజ్జగిస్తూ ఆకాశాన్ని బుజ్జిమేకను చేస్తాడు.. పాలించే దక్షుడవుతాడు..
సి.యస్.రాంబాబు
7/11/25