కం!!💐💐💐

ఆకులను తిన్న మేకలు
నేకముగా కొండలన్ని యెక్కుచునుండున్
మేకలను తిన్న మనుజులు
ప్రాకుదురే మంచమునకు పడిపడి కృష్ణా!!

ఆ!!వె!!💐💐💐

గరిక పోచ విడువ గణపతి మురియును
చెంబెడు జలమునకు శివుడు మురియు
పండ్లుపూలతోడ పార్వతి మురియంగ
నోటులేల కృష్ణ వోటరునకు?

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *